APPSC: గ్రూప్ 2 దరఖాస్తుల గడువు పొడిగింపు-ఎప్పటివరకంటే ?
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్ధులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. అభ్యర్ధుల నుంచి వస్తున్న వినతుల మేరకు గ్రూప్ 2 పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన గడువును మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వాస్తవంగా గ్రూప్ 2 పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్ధులకు ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగియనుంది. దీన్ని మరో వారం రోజుల పాటు అంటే జనవరి 17వరకూ ఏపీపీఎస్సీ పొడిగించింది.
ఈ ఏడాది వివిధ ప్రభుత్వ శాఖల్లో 897 ఉద్యోగాల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం అభ్యర్ధులు దరఖాస్తు చేసుకునేందుకు విధివిధానాలు కూడా విడుదల చేసింది. అయితే దరఖాస్తులకు ఇచ్చిన గడువు పొడిగించాలంటూ ఏపీపీఎస్సీకి అభ్యర్ధుల నుంచి పలు వినతులు వచ్చాయి. దీనిపై పరిశీలన జరిపిన కమిషన్.. జనవరి 17 వరకూ గడువు పొడిగిస్తూ ఇవాళ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రిలిమినరీ పరీక్ష తేదీ అయిన ఫిబ్రవరి 25లో ఎలాంటి మార్పూ లేదని తెలిపింది.

ఏపీపీఎస్సీ గత నెలలో జారీచేసిన గ్రూపు-1, 2 నోటిఫికేషన్ లకు దరఖాస్తులు చేసుకునే విషయంలో అభ్యర్ధులకు పలు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. వీటిల్లో గ్రూప్ 2 పోస్టులకు డిసెంబర్ 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యంగా కమిషన్ సర్వర్ మొరాయించడంతో పలువురు అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోలేకపోయారు.అయితే గడువు మాత్రం జనవరి 10వ తేదీతో ముగుస్తుండటంతో అభ్యర్ధులపై ఒత్తిడి పెరిగింది. చివరకు ఏపీపీఎస్సీ తాజా నిర్ణయంతో వారు ఊపిరిపీల్చుకుంటున్నారు.












Click it and Unblock the Notifications