APPSC Group 1 Notification: ఏపీపీఎస్సీ గ్రూప్1 నోటిఫికేషన్-పోస్టులు, షెడ్యూల్..!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, దరఖాస్తులు, పరీక్ష తేదీలు, ఇతర వివరాలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈసారి గ్రూప్ 1 లో 163 పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు. వీటి భర్తీ కోసం అక్టోబర్ 6 నుంచి 27వ తేదీ వరకూ దరఖాస్తుల్ని స్వీకరించబోతున్నారు. అనంతరం వాటిని ప్రాసెస్ చేసి, పరీక్షలు నిర్వహించబోతున్నారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల ద్వారా ఈసారి భర్తీ చేయబోయే 163 పోస్టుల వివరాలను నోటిఫికేషన్ లో వెల్లడించారు. ఇందులో 11 డిప్యూటీ కలెక్టర్లు, 14 ట్యాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్లు, 36 సివిల్ డీఎస్పీలు, 3 కమ్యూనికేషన్ డీఎస్పీలు, 14 డీఈఓలు, ఒక ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, 3 ఆర్డీవోలు, 15 డిప్యూటీ రిజిస్టార్ కోఆపరేటివ్ సర్వీసెస్, 12 మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 పోస్టులు, 2 అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు, 3 జిల్లా ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్ పోస్టులు, 14 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు, 35 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.

వీటిని భర్తీ చేసేందుకు ఈ ఏడాది చివర్లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుత నోటిఫికేషన్ లో తేదీలు ఖరారు కాలేదు. ఆయా పోస్టులకు వచ్చే దరఖాస్తుల ఆధారంగా పరీక్షల షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. అప్పటివరకూ అభ్యర్ధులు తమకు అర్హతలు ఉన్న పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అధికారులు దరఖాస్తుల పరిశీలన, ఇతర ప్రక్రియలు పూర్తి చేసి తుది అభ్యర్ధుల జాబితాను ఖరారు చేస్తారు. అనంతరం పరీక్షల తేదీల్ని ప్రకటించారు.














Click it and Unblock the Notifications
