APPSC Group1: గ్రూప్-1 ఇంటర్వూలకు హైకోర్టు బ్రేక్-నాలుగు వారాల పాటు
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలపై ఆరోపణల నేపథ్యంలో రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలపై పలువురు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు నాలుగు వారాల పాటు ఎలాంటి చర్యలు చేపట్టకుండా స్టే ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీపీఎస్సీ గ్రూప్ పరీక్షల మూల్యాంకనంపై పలువురు అభ్యర్ధులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలుగు మాధ్యమంలో జరిగిన పరీక్షల మూల్యాంకనం రాష్ట్రంలోనూ, ఇంగ్లీష్ మీడియం పరీక్షల మూల్యాంకనం ఇతర రాష్ట్రాల్లోనూ జరిగింది. ఇందులో ఇంగ్లీష్ మీడియం అభ్యర్ధులు ప్రైవేటు వ్యక్తులతో మూల్యాంకనం చేయించడం వల్ల తమకు అన్యాయం జరిగిందని హైకోర్టును ఆశ్రయించారు. తెలుగు మీడియం అభ్యర్ధులతో పోలిస్తే తాము పరీక్షల్లో నష్టపోయినట్లు ఇంగ్లీష్ మీడియం అభ్యర్ధులు కోర్టు దృష్టికి తెచ్చారు.

Recommended Video
గ్రూప్ 1 ఇంగ్లీష్ మీడియం పరీక్షలు రాసిన అభ్యర్ధులు దాఖలు చేసిన ఎనిమిది పిటిషన్లపై విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్ధానం నాలుగు వారాల పాటు ఇంటర్యూలను వాయిదా వేసింది. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను పక్కనబెట్టి కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరించారని పిటిషన్లు కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన న్యాయస్ధానం వివరణ ఇవ్వాలంటూ ఏపీపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. ఇంటర్వ్యూల తదుపరి తేదీల్ని త్వరలో ప్రకటిస్తామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.












Click it and Unblock the Notifications