వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

APPSC:అభ్యర్థుల కోసం ఆ పరీక్ష ప్రశ్నాపత్రాలు వెబ్‌సైట్‌లో పెట్టిన ఏపీపీఎస్సీ

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల సౌలభ్యత కోసం ఆయా పరీక్షలకు సంబంధించి పాత ప్రశ్నాపత్రాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. ఇవన్నీ గతంలో జరిగిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు. ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌ చూడటం వల్ల ప్రశ్నాపత్రం ఎలా ఉంటుందనేదానిపై అభ్యర్థులకు ఒక స్పష్టత ఏర్పడుతుందని ఏపీపీఎస్సీ పేర్కొంది. అంతేకాదు ప్రిపరేషన్ కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేసుకునేందుకు ఇది ఉపయుక్తంగా మారుతుందని అభిప్రాయపడింది.

ఇక మొత్తంగా 54 ప్రశ్నాపత్రాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఏపీపీఎస్సీ తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. ఏపీ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జరిగే జూనియర్ లెక్చరర్ పోస్టులు, కాలేజ్ లెక్చరర్ పోస్టుల పరీక్షకు సంబంధించిన పేపర్లు కూడా అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఇక 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు సంబంధించి కొశ్చన్ పేపర్లు, 2016- గ్రూప్ 1 మరియు గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రాలతో పాటుగా ఇటీవలే జరిగిన పంచాయత్ సెక్రటరీ ప్రశ్నాపత్రాలు కూడా వెబ్‌సైట్‌లో పొందుపర్చింది.

APPSC puts previous years question papers on its website

ఇక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్, అసిస్టెంట్ ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, డిప్యూటీ సర్వేయర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్, టెక్ అసిస్టెంట్ జియో ఫిజిక్స్, టెక్నికల్ అసిస్టెంట్ జియో ఫిజిక్స్, రాయల్ అసిస్టెంట్ జియోఫిజిక్స్ పరీక్షలకు ప్రిపేర అయ్యే అభ్యర్థులకు కావాల్సిన పాత పరీక్షా ప్రశ్నాపత్రాలను కూడా వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. ఈ ప్రశ్నాపత్రాలను డౌన్‌లోడ్ చేసుకుని ఒకసారి సమీక్షించడం వల్ల అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. పరీక్ష విధానం ఎలా ఉంటుంది, ప్రశ్నలు ఎలా వస్తాయి, ఎగ్జామినేషన్ సిలబస్ వంటి అంశాలపై అవగాహన వస్తుంది.

English summary
Andhra Pradesh Public Service Commission (APPSC) has made available past years' question papers of various notifications and posts issued by APPSC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X