ఏపీలో ఆటో డ్రైవర్లకు రేపే 15వేలు..! అందకపోతే ఏం చేయాలంటే?

ఏపీలో కూటమి సర్కార్ తమ ఎన్నికల హామీ కాని ఓ పథకాన్ని రేపు ప్రారంభించబోతోంది. ఆటో, క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్లకు ఏడాదికి 15 వేల చొప్పున సాయం అందించే పథకాన్ని ప్రారంభిస్తోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలో ఈ కార్యక్రమం మొదలు కానుంది. దీనికి 'ఆటో డ్రైవర్ సేవలో...' అనే పేరును ఇప్పటికే ఖరారు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇవాళ ప్రభుత్వం వెల్లడించింది.

రాష్ట్రంలోని సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు ప్రభుత్వం ఈ ఈ పథకాన్ని అమల్లోకి తెస్తోంది. ఈ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఇస్తారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో రేపు ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. సొంత ఆటో, క్యాబ్ కలిగి వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారి కోసం ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.436 కోట్లను కేటాయించింది. ఈ నిధులను నేరుగా డ్రైవర్ల ఖాతాలో జమ చేస్తారు.

AP s 15 000 Aid Scheme for Auto Drivers Launches Tomorrow Full Details

గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు కేవలం ఏడాదికి రూ.10 వేలు మాత్రమే ఇవ్వగా.. కూటమి సర్కార్ దాన్ని 15 వేలకు పెంచి ఇస్తోంది. గత ప్రభుత్వం ఈ పథకానికి కేవలం 2,61,516 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించి రూ.261.51 కోట్లే ఖర్చు పెట్టగా.. ఈ ప్రభుత్వం సుమారు 30 వేల మందికి అదనంగా ఇవ్వబోతోంది. ఈ పథకంలో ఆటో డ్రైవర్లు 2,25,621 మంది, త్రీ వీలర్ ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు 38,576 మంది, మోటార్ క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సి క్యాబ్ డ్రైవర్లు 6,400 మంది ఉన్నారు. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 22,955 మంది డ్రైవర్లు ఉన్నారు.

AP s 15 000 Aid Scheme for Auto Drivers Launches Tomorrow Full Details

ఇప్పటికే కూటమి ప్రభుత్వం వాహనదారులకు మేలు కలిగేలా రోడ్ల మరమ్మత్తులు చేపట్టడంతో పాటు పాతవాహనాలపై గత ప్రభుత్వం భారీగా వేసిన గ్రీన్ ట్యాక్స్‌ను కుదించింది. నాడు రూ.20 వేలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ ను రూ.3 వేలకు తగ్గించింది. వీటితో పాటు ఇప్పుడు ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకం లభించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అర్హత ఉండి కూడా జాబితాలో పేరు లేకుంటే వారి సమస్యను పరిష్కరించిన వెంటనే లబ్ధిదారుల జాబితాలో చేర్చనున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది. వాట్సాప్ ద్వారా ఒక ప్రత్యేక గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+