విభజన తప్పదు, వృథానే: కిల్లి, కిరణ్‌పై కేసు నమోదు

తాము ఎప్పటికీ సమైక్యవాదులమే అన్నారు. అయితే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగుతుంటే విభజన ఆగుతుందని తాను అనుకోవడం లేదన్నారు. మనకు రావాల్సిన హక్కులను కాపాడుకోవడం తప్ప మరో మార్గం వృథా అన్నారు. సమైక్యం కోసం పాకులాడడం కాకుండా సీమాంద్రకు రావాల్సిన హక్కులపై పోరాటం తప్ప మరేమి చేయలేమన్నారు.
రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ అదినేత నారాచంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలేనని ఆరోపించారు. విభజనకు సానుకూలంగా కేంద్రానికి సంకేతాలు ఇస్తూ లేఖలు ఇచ్చిన ఆ రెండు పార్టీలు గతాన్ని మరిచి వ్యవహారించడం విడ్డూరంగా వుందన్నారు. చంద్రబాబు, జగన్ ఇద్దరు సీమాంద్ర ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు.
కిరణ్ పైన కేసు నమోదు
రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తూ ఇరు ప్రాంతాల వారినీ రెచ్చగొడుతున్నారంటూ గతంలో న్యాయవాది జనార్దన్ రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు ఈమేరకు కేసు నమోదు చేయాల్సిందిగా సరూర్‌నగర్ పోలీసులను ఆదేశించింది.












Click it and Unblock the Notifications