ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర..రాతపరీక్ష లేదు, లాస్ట్ డేట్ అప్పుడే..త్వరపడండి!

ఏపీఎస్ఆర్టీసీ తాజాగా నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి పలు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచుతుంది ఏపీ ప్రభుత్వం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు నుండి ఏపీఎస్ఆర్టీసీలో నియామకాల జోరు కూడా పెరిగింది.

277 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఏపీఎస్ ఆర్టీసీ
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ మరో తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న 277 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఏపీ రోడ్డు రవాణా సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 25వ తేదీ నుంచి ఈ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చునని ప్రకటించింది. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 8వ తేదీగా నిర్ణయించింది.

APS RTC jobs notification no written exam applications last date on november 8th hurry up

ఈ విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఏపీఎస్ఆర్టీసీలో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెషినిస్ట్, పెయింటర్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్ వంటి పలు విభాగాలలో ఖాళీలను భర్తీ చేయడానికి ఏపీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను చూస్తే నంద్యాల జిల్లాలో 43, కర్నూలు జిల్లాలో 46, అనంతపురం జిల్లాలో 50, శ్రీ సాయి జిల్లాలో 34, కడప జిల్లాలో 60, అన్నమయ్య జిల్లాలో 44 అప్రెంటిస్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి.

రాతపరీక్ష లేదు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఐటిఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారికి దరఖాస్తు ఫీజు ప్రతి అభ్యర్థి 118 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఎటువంటి రాత పరీక్షలు నిర్వహించరు.

దరఖాస్తులకు లాస్ట్ డేట్ అప్పుడే
కేవలం విద్యార్హతల మెరిట్ లిస్ట్ ఆధారంగా , డాక్యుమెంట్ల వెరిఫికేషన్ తర్వాత అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన అభ్యర్థులు ఖాళీ ఉన్న జిల్లాలలో అప్రెంటిస్ పోస్టులలో పనిచేస్తారు. నవంబర్ 8వ తేదీ వరకే దరఖాస్తులకు చివరి తేదీ ఉండడంతో ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+