మండుతున్న ఎండల వేళ పిడుగులు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!

వాతావరణంలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. మండుతున్న వేళ అకాల వర్షాలు రెండు రాష్ట్రా ల్లో కొనసాగుతున్నాయి. తాజాగా ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ఏపీలోని పలు జిల్లాలకు పిడుగు పాటు హెచ్చరిక చేసింది. రాగల మూడు గంటల్లో అల్లూరి, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలర్ట్స్ జారీ అయ్యాయి. ఇదే సమయంలో 40-60కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఏపీ, తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఓ వైపు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుంటే... మరోవైపు అక్కడక్కడ వర్షాలు సైతం కురుస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దాని పరిసర ప్రాంతాలపై ఒక ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 3.1 కిలోమీటర్ల మధ్య ఎత్తులో విస్తరించి ఉన్నది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావ రణం పై అలర్ట్స్ జారీ చేసింది. శనివారం, ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

apsdma-alerts-on-rains-in-many-parts-of-the-state-for-next-three-days-key-suggestions-issued

పలు జిల్లాలకు వర్షాల హెచ్చరిక

అదే విధంగా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని చెప్పిన విపత్తుల నిర్వహణ శాఖ... ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు వేగముతో వీస్తాయని అప్రమత్తం చేసింది. శని, ఆదివారాల్లో దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుందని పేర్కొంది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు వేగముతో వీస్తాయని అంచనా వేసింది. అదే విధంగా రానున్న మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. చాలా జిల్లాల్లో శుక్రవారం.. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా గా వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+