ఏపీకి మరో తుఫాను ముప్పు, రేపటి నుంచే- ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!!
ఏపీ వైపు మరో తుఫాను దూసుకొస్తోంది. ఆర్నాబ్ నష్టం నుంచి కోలుకోక ముందే మరో తుఫాను పైన తాజా హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కీలక సమాచారం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం రాబోయే ఆరు గంటల్లో వాయుగుండంగా బలపడి రేపు (ఆదివారం) సాయంత్రానికి తుఫాను గా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఏపీని వరుస తుఫాన్లు వెంటాడుతున్నాయి. అండమాన్ లో ఏర్పడిన అల్పపీడనం రానున్న ఆరు గంటల్లో వాయుగుండం గా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఇది మరింత బలపడి రేపు సాయంత్రానికి తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్ తీరం సమీపంలోని చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. సోమ, మంగళవారాల్లో సెంట్రల్ ఆంధ్రా , రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తామని.. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తీరం వెంబడి 45-65 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పిన అధికారులు.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

విపత్తుల నిర్వహణ శాఖ అంచనాలతో
ఈ తుఫాను మధ్య కోస్తాంధ్రలో మచిలీపట్నం - బాపట్ల మధ్య ఇది తీరం దాటే సూచనలు ఉన్నాయి. దీంతో.. కోస్తాంధ్రలో నవంబర్ 1 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆర్నాబ్ తుఫాను కారణంగా కోనసీమ భారీగా నష్టపోయింది. ఉత్తరాంధ్ర జిల్లాలు వణికిపోయాయి. దాదాపు రూ 4, 600 కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రభుత్వం తాజాగా అంచనా వేసింది. కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక టీంలు తుఫాను ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తున్నాయి. బాధితులకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. కాగా.. ఇప్పుడు వెంటనే మరో తుఫాను కోస్తాంధ్ర పైన ప్రభావం చూపనుంది. దీంతో.. కోస్తాంధ్ర జిల్లాలకు తాజా అలర్ట్స్ జారీ అయ్యాయి. ఈ నెల 2,3 తేదీల్లో భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications
