రాప్తాడులో దారుణం.. రంపంతో పదో తరగతి బాలికపై ఉన్మాది ఘాతుకం, తెగిపడిన చేయి..

పాఠాలు వినిపించాల్సిన పాఠశాల ప్రాంగణం ఒక్కసారిగా ఆర్తనాదాలతో విలవిలలాడింది. అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం అత్యంత పాశవిక, దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రశాంతంగా పాఠాల్లో నిమగ్నమై ఉన్న సమయాన, ఓ ఉన్మాది హఠాత్తుగా ఎలక్ట్రిక్ రంపంతో తరగతి గదిలోకి చొరబడ్డాడు. పదో తరగతి చదువుతున్న ఒక బాలికపై రంపంతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. కళ్లెదుటే జరిగిన ఈ దారుణాన్ని చూసి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు భయంతో పరుగులు తీశారు.

తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో బాలిక.. పరిస్థితి విషమం!

దుండగుడు జరిపిన పదునైన రంపపు దాడిలో ఆ పసిపాప కుడి చేయి తెగిపడగా, ముఖం, గొంతు భాగాల్లో తీవ్రమైన లోతైన గాయాలయ్యాయి. రక్తం ఓడుతూ పాఠశాల ఆవరణలోనే కుప్పకూలిన చిన్నారిని ఉపాధ్యాయులు, స్థానికులు వెంటనే అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రి అత్యవసర విభాగంలో వైద్యుల బృందం బాలికను కాపాడేందుకు శ్రమిస్తోంది. ఆపదలో ఉన్న విద్యార్థిని పరిస్థితి ఇంకా విషమంగానే ఉనట్లు వైద్యులు స్పష్టం చేశారు.

Class 10 Student Severely Injured After Brutal Attack With Saw Inside School Classroom in Raptadu

తప్పించుకున్న దుండగుడు.. బంధువుల తీవ్ర ఆగ్రహం!

దాడికి పాల్పడిన అనంతరం ఉపాధ్యాయులు అతడిని చుట్టుముట్టే లోపే ఆ దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. అయ్యవారిపల్లెకు చెందిన ఈ విద్యార్థినికి నిత్యం ఆటోలోనే స్కూలుకు వెళ్లే అలవాటు ఉందని, ఎవరైనా వేధిస్తున్నట్లు ఎప్పుడూ తమకు చెప్పలేదని బాలిక మేనత్త తెలిపారు. అసలు పాఠశాల లోపలికి రంపంతో ఒక వ్యక్తి ఎలా రాగలిగాడని ప్రశ్నిస్తూ బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు ఎంతటి వారైనా, ఆఖరికి తమ బంధువైనా సరే కఠినంగా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు.

Video: LKG చిన్నారిపై రాక్షసత్వం! రాళ్ళు, పూల కుండీలతో థర్డ్ క్లాస్ స్టూడెంట్ దాడి
Video: LKG చిన్నారిపై రాక్షసత్వం! రాళ్ళు, పూల కుండీలతో థర్డ్ క్లాస్ స్టూడెంట్ దాడి

ఘటనా స్థలానికి పోలీసులు.. ముమ్మర గాలింపు!

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక వివరాలు సేకరించారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి సమాచారం తీసుకుని కేసు నమోదు చేశారు. పారిపోయిన నిందితుడి ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పాఠశాల ఆవరణలో చోటుచేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

Viral Video: అరేయ్ చిన్న పిల్లరా పాపంరా.. స్కూల్ లో బాలికపై ప్యూన్ దారుణం
Viral Video: అరేయ్ చిన్న పిల్లరా పాపంరా.. స్కూల్ లో బాలికపై ప్యూన్ దారుణం

సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన.. కఠిన చర్యలకు ఆదేశం!

రాప్తాడు హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన ఈ అమానుష దాడిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాబుద్ధులు నేర్పే పాఠశాలలోకి రంపంతో వచ్చి దాడి చేయడం దారుణమన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న వైద్య సేవలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ఉన్మాదిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+