మరో 24 గంటలు - ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
ఏపీని వర్షాలు వదలటం లేదు. తాజా వర్షాలతో ప్రజా జీవనం పై ప్రభావం పడింది. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. రైల్వే, రోడ్డు రవాణా వ్యవస్థ దెబ్బతింది. ప్రభుత్వం నిరంతరం వర్షప్రభావం..నష్టం.. సహాయక చర్యల పైన సమీక్ష చేస్తోంది. ఇదే సమయంలో అమరావతి వాతావరణ శాఖ కీలక సమాచారం ఇచ్చింది. మరో 24 గంటలు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. పలు జిల్లాలను అలర్ట్ చేసింది.
తాజా అలర్ట్
ఏపీలో వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. రానున్న 24 గంటలు మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తం చేసింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించింది. విజయవాడ నగరం తాజా వర్షాలతో భారీగా దెబ్బతింది. రికార్డు వర్షపాత నమోదైంది.

విజయవాడలో వరద
విజయవాడలో బుడమేరు ఉప్పొంగడంతో సింగ్‌నగర్‌కాలనీని వరద నీరు ముంచెత్తింది. కాలనీ మొత్తం నడుం లోతు నీటితో మునిగిపోయింది. దీంతో వరద బాధిత ప్రాంతాలను లైఫ్ జాకెట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాలు, వరదలకు బెజవాడ అతలాకుతలం అవుతోంది. అంబాపురం, వైఎస్సార్ కాలనీ, రాజీవ్‌నగర్, జక్కంపూడి, అజిత్‌సింగ్‌నగర్, కండ్రిగ, న్యూరాజరాజేశ్వరిపేట, సుందరయ్యనగర్‌లు నీటమునిగాయ్. అనేక కాలనీల్లో ఐదు అడుగుల మేర నీరు నిలిచిపోయింది.
ప్రభుత్వం అప్రమత్తం
భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు డిజాస్టర్ కార్యాలయంలో సమీక్ష చేసారు. వరదలపై ఇరిగేషన్ సహా ఇతర శాఖల అధికారులతో మాట్లాడాలని సీఎం ఆయనకు సూచించారు. వరద తగ్గిన తర్వాత ఆస్తి, పంటనష్టం వివరాలు సేకరించాలన్నారు. దెబ్బతిన్న పంటల వివరాలను డ్రోన్ల ద్వారా అంచనా వేయాలన్నీరు చంద్రబాబు. దెబ్బతిన్న ఇళ్లు, పశునష్టాన్ని మదింపు చేయాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని సహాయక చర్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో హైఅలెర్ట్ కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications