పుష్కరాలు: బస్‌లో నిలబడితే ఫ్రీ.. ఆర్టీసి బంపర్ ఆఫర్, కిమీ మేర ట్రాఫిక్

రాజమండ్రి: పుష్కరాలకు వచ్చే యాత్రీకుల రద్దీ దృష్ట్యా ఆర్టీసి అధికారులు భక్తులకు బంపర్ ఇచ్చారు. రాజమండ్రి డిపో నుంచి విశాఖపట్నం వైపు అవసరమైన బస్సులు ఏర్పాటు చేయలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారట.

దీంతో, వారు ఓ ప్రయోగం చేసినట్లుగా చెబుతున్నారు. విశాఖపట్నం వరకూ బస్సు టిక్కెట్ ధర రూ.157 వసూలు చేస్తున్నారు. అయితే, నిలబడి వెళ్లే ప్రయాణీకులకూ ధర రూ.100 చేస్తున్నారు. అలా ప్రకటిస్తూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు.

కాగా, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో, ఉదయం వరకు నిలబడితే ఫ్రీ అని చెప్పిన ఆర్టీసీ అధికారులు.. ఆ తర్వాత నిలబడితే ఉచితంగా అని చెప్పడం గమనార్హం. రాజమండ్రి - విశాఖ ఆర్టీసీ బస్సుల్లో నిలబడితే ఉచితంగా వెళ్లవచ్చు. విశాఖకు 1,050 బస్సులు నడుస్తున్నాయి. ఇతర ప్రాంతాలకు 2500 బస్సులు నడుస్తున్నాయి.

APSRTC bumper offer for Pushkar passengers

పుష్కరాలలో పాల్గొన్న భక్తులు ట్రాఫిక్‌తో నానా ఇబ్బందులు పడుతున్నారు. రాజమండ్రి నుండి విజయవాడ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ప్రజలు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు.

ట్రాపిక్ జాం వల్ల బస్సులు ఆలస్యం కావడం లేదా నడపలేకపోవడం జరుగుతోంది. ఇదిలా ఉండగా, పుష్కరాలకు భక్తులు పోటెత్తుతున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ జాం అవుతోంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+