chandrababu arrest: నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ బస్సులు

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిపివేశారు. శనివారం తెల్లవారుజామునే పలు ప్రాంతాల్లో డిపోలు, బస్టాండ్ల వద్దకు వెళ్లిన పోలీసులు.. ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు.

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తిరిగే అన్ని బస్సులను నిలిపివేశారు. విజయవాడ నగరంలో తిరిగే సిటీ బస్సులు కూడా కదల్లేదు. ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మాత్తుగా బస్సులను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యాలయాలు, కార్యాలయాలకు వెళ్లాల్సిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

apsrtc bus services have been stopped by the police, after chandrababu naidu arrest

బస్సులను ఎందుకు నిలిపివేశారో.. ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదని కొందరు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు వాపోయారు. విశాఖపట్నం ద్వారకానగర్ బస్ స్టేషన్‌లో ప్రయాణికులను కిందకు దించేసి బస్సులను డిపోలకు తరలించారు. టికెట్లు తీసుకున్నా.. ప్రయాణికులకు డబ్బులు తిరిగి ఇచ్చేశారు. ఇక రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు కొంత సమయం వేచిచూడాలని సూచించారు.

శనివారం ఉదయం తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు బస్లాండ్ల వద్దకు వచ్చిన చాలా మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు నిలిపివేయడంతో వెనుదిరిగివెళ్లిపోయారు. అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు డిపోల నుంచి ఒక్క బస్సు కదలలేదు. విశాఖపట్నం సిటీ బస్సులు కూడా నిలిచిపోయాయి. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కడప, శ్రీకాకుళం ఇలా జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి.

కాగా, శుక్రవారం అర్ధరాత్రి నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద చంద్రబాబు బస చేశారు. శుక్రవారం అర్ధరాత్రే అక్కడికి చేరుకున్న సీఐడీ పోలీసులు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో శనివారం ఉదయం చంద్రబాబును అరెస్ట్ చేశారు. అయితే, ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని, ఆధారాలు చూపాలని చంద్రబాబు పోలీసులను నిలదీశారు. కాగా, చంద్రబాబును విజయవాడకు తరలించి.. ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

మరోవైపు, చంద్రబాబు నాయుడు అరెస్టుతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం నుంచి పలువురు టీడీపీ నేతలను పోలీసులు నిర్బంధించారు. పలువురిని హౌస్ అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+