ఓటరు దేవుళ్ల కోసం ఏపీఎస్ఆర్ టీసీ స్పెషల్ సర్వీసులు, అన్ని బస్సులు ఫుల్, బెంగళూరు వాషౌట్!
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకే రోజు జరుగుతున్నాయి. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న తెలుగు వాళ్లు చలో ఏపీ అంటూ పయనం అయ్యారు. విదేశాల నుంచి కూడా చాలా మంది ఓటు వెయ్యడానికి ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న లక్షలాది మంది ప్రజలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని వాళ్లవాళ్ల సొంత ఊర్లకు చేరుకుంటున్నారు.
ఐటీ హబ్ బెంగళూరు నగరంలో కొన్ని లక్షల మంది ప్రవాసాంధ్రులు నివాసం ఉంటున్నారు. చాలా సంవత్సరాల నుంచి బెంగళూరులో నివాసం ఉంటున్న తెలుగు వాళ్లు వారి ఓటు మాత్రం ఆంధ్రప్రదేశ్ లోని సొంత ఊర్లలోనే పెట్టుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, కార్పోరేషన్, మునిసిపాలిటి, పంచాయితీ ఎన్నికలు వచ్చిన సమయంలో బెంగళూరు నుంచి సొంత ఊర్లకు వెళ్లి వారికి నచ్చిన నాయకులకు ఓటు వేసి తరువాత బెంగళూరు చేరుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలు జరుగుతున్నాయి. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ నాయకుల తలరాతలు మార్చడానికి ఓటర్లు సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు సొంత ఊర్లకు వెళ్లిపోయారు. బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న చాలా మంది తెలుగు వాళ్లు ఆంధ్రప్రదేశ్ లోని సొంత ఊర్లకు చేరుకున్నారు.
బెంగళూరులో నివాసం ఉంటున్న తెలుగు ప్రజలు వార సొంత ఊర్లు చేరుకోవడానికి ఏపీఎస్ ఆర్ టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల నుంచి బెంగళూరు వచ్చి వెళ్లే మామూలు సర్వీసులు కాకుండా ఎన్నికల సందర్బంగా ఏపీఎస్ఆర్ టీసీ ప్రత్యేక సర్వీలు నడిపింది, శుక్రవారం రోజు బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు 113 ప్రత్యేక సర్వీలు నడిపామని బెంగళూరులోని ఏపీఎస్ ఆర్ టీసీ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ (ఏటీఎం) రవీంధ్రనాథ్ రెడ్డి చెప్పారు.
శుక్రవారం రోజు 113 స్పెషల్ సర్వీసులు, శనివారం రోజు 75 సర్వీసులు, ఆదివారం రోజు 25 ప్రత్యేక బస్సు సర్వీసులు బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని ఏపీఎస్ఆర్ టీసీ ఏటీఎం రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. బెంగళూరు నుంచి సొంత ప్రాంతాలకు వెలుతున్న ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏటీఏం రవీంధ్రనాథ్ రెడ్డితో పాటు బెంగళూరులోని ఏపీఎస్ఆర్ టీసీ సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
బెంగళూరులో నగరంలో నివాసం ఉంటున్న లక్షలాది మంది ఇప్పటికే వారి సొంత వాహనాల్లో వాళ్ల ఊళ్లకు వెళ్లిపోయారు. ఇక పలు జిల్లాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకులు బెంగళూరులో ఉండే ఓటర్ల కొసం ప్రత్యేకంగా ప్రైవేటు బస్సులు ఏర్పాటు చేశారు. ఫ్రీ బస్సులతో పాటు వారికి టిఫిన్లు, భోజనాలు, వసతి ఏర్పాట్లు చేస్తున్నారు.
బెంగళూరు నగరంలోని యలహంక, కేఆర్ పురం, బనశంకరి, ఇట్టుపడు, మడివాళ, మారతహళ్లి, వైట్ ఫీల్డ్, హెబ్బాళ, శ్రీరాంపుర, తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న తెలుగు ఓటర్లను ప్రైవేటు బస్సుల్లో వారి సొంత ప్రాంతాలకు పిలుచుకుని వెలుతున్నారు. మొత్తం మీద పలు ప్రాంతాల్లోని తెలుగువాళ్లు ఆంధ్రప్రదేశ్ లోని సొంత ఊర్లకు వెళ్లిపోవడంతో రెండు రోజుల నంచి ఆ ప్రాంతాలు బోసిపోయాయి.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications