APSRTC: ఏపీ సర్కార్ కు ఉద్యోగుల తాజా అల్టిమేటం..! ఇక తాడో పేడో..!

ఏపీలో ఆర్టీసీ (APSRTC)ప్రైవేటీకరణకు జరుగుతున్న ప్రయత్నాలపై ఉద్యోగ సంఘాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా విద్యుత్ బస్సుల ఆపరేటర్లకు ఆర్టీసీ బస్సు డిపోల్ని అప్పగించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఇవాళ గుర్తింపు ఉద్యోగ సంఘం ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే 20వ తేదీ నుంచి నిరసనలకు దిగుతామని హెచ్చరించింది.

విద్యుత్ బస్సు ఆపరేటర్లకు ఆర్టీసీ డిపోలు అప్పగింత నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్ ఇవాళ మరోమారు కోరింది. గుంటూరు-2, విధ్యాదరపురం డిపోలు ఖాళీ చేయించొద్దని, వాటికి బదులుగా విద్యుత్ బస్సు ఆపరేటర్లకు ప్రత్యామ్నాయ స్థలాలు ఇవ్వాలని సూచించింది. ఉద్యోగ సంఘాలతో వెంటనే సమావేశం నిర్వహించాలని ఈయూ డిమాండ్ చేసింది. బస్సులు ప్రైవేట్ కాకుండా ఆర్టీసీ యాజమాన్యమే నడపాలని కూడా కోరింది.

APSRTC Employees Union Threaten Action to Stop Private Handover of Bus Depots

ఈ మేరకు ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే విద్యుత్ బస్సుల ఆపరేటర్లకు ప్రభుత్వం అప్పగించాలని చూస్తున్న 11 డిపోల వద్ద నిరసనలు ప్రారంభిస్తామని ఈయూ అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్, ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య హెచ్చరించారు. ఈ మేరకు రవాణాశాఖ కమిషనర్ కు సైతం వీరు లేఖ రాశారు. ఇందులో పీఎం ఈ-బస్ సేవ పథకాన్ని పీపీపీ విధానంలో అమలు చేయడం వల్ల ఆర్టీసీ నిర్వీర్యం అవుతుందని హెచ్చరించారు.

APSRTC Employees Union Threaten Action to Stop Private Handover of Bus Depots

ఆర్టీసీ ఉద్యోగుల భద్రత, యువత ఉపాధి, ప్రయాణికుల భద్రత, సంస్థ దీర్ఘకాలిక ఆర్ధిక స్దిరత్వంపై తీవ్ర ప్రభావం చూపుతాయని భావిస్తున్న ఈ నిర్ణయాలపై ఉద్యోగుల నిరసనల్ని ఆపాలంటే తక్షణం ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చించాలని ఈయూ నేతలు డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+