ఉచిత బస్సు పథకం అమలులో మరో కీలక నిర్ణయం, ఇక కొత్తగా..!!
మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభించిన ఈ పథకానికి మంచి స్పందన కనిపిస్తోంది. పథకం అమలు వేళ లబ్ది దారుల నుంచి ప్రభుత్వం ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది. దీనికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటోంది. తాజాగా తిరుమలకు వెళ్లే బస్సుల్లోనూ పథకం అమలు చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో పథకానికి సంబంధించి ఆర్టీసీ ఎండీ కీలక ప్రకటన చేసారు.
ఉచిత బస్సు ప్రయాణం వైపు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు పైన ఆర్టీసీ డిపోల వారీగా సమాచారం సేకరిస్తోంది. ప్రభుత్వం సైతం ప్రయాణీకుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది. ప్రస్తుతం అయిదు కేటగిరీల బస్సుల్లో ఈ పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతీ రోజూ 21 లక్షల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని పొందుతున్నారని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. స్త్రీశక్తి పథకంలో ప్రస్తుతం 60 శాతం మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు చెప్పారు.

ఆర్టీసీకి ఈ పథకం అమలు ద్వారా కొంత భారం అయినా.. ప్రభుత్వ లక్ష్యాలను అందుకునేలా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. త్వరలో 1050 ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయని చెప్పారు. అదే విధంగా మరో 1500 బస్సులు సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 1500 మందిని కారుణ్య నియామకాల కింద నియమించుకున్నామని ఎండీ వివరించారు.
పెన్షను సైతం పెంచామని తెలిపారు. ఇక.. తాజాగా ప్రభుత్వం ఘాట్ రోడ్ల సర్వీసుల్లోనూ ఉచిత బస్సు పథకం అమలుకు నిర్ణయించింది. దీని ద్వారా తిరుమల కొండకు వెళ్లే బస్సుల్లోనూ ఈ పథకం అమల్లోకి వచ్చింది. పథకం కోసం కేటాయించిన బస్సులకు ప్రత్యేక రంగులు.. జీరో టికెట్ల జారీ విషయంలో సిబ్బందికి స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న బస్ పాస్ ల ద్వారా ఉచిత బస్సుల్లో ప్రయాణానికి అనుమతి ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications