సంక్రాంతికి ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఏపీఎస్ఆర్టీసీ; ప్రత్యేక రైళ్ళను పెంచిన రైల్వే!!
తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను అత్యంత ఘనంగా పెద్ద పండుగగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగకు హైదరాబాద్లో ఉన్న ఏపీ వాసులు దాదాపుగా తమ సొంత గ్రామాలకు వెళ్లి పండుగను జరుపుకుంటారు. దీంతో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా బస్సులు, రైళ్లు కిటకిటలాడుతాయి.
ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని ప్రజలంతా భావిస్తున్న వేళ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సంక్రాంతి ప్రయాణికులకు పండుగకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఏపీ ఎస్ ఆర్టీసీ తెలిపింది. మొత్తం 6795 స్పెషల్ బస్సులు సంక్రాంతి పండుగ కోసం నడపనున్నట్లు వెల్లడించింది. ఈ బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నట్లు పేర్కొంది.

ఈ నెల 6 నుంచి 18 వరకు స్పెషల్ బస్సులు నడుస్తాయని ఏపీ ఎస్ ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. రానుపోనూ ఒకేసారి టికెట్లు బుక్ చేసుకున్నవారికి 10 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణ సంస్ద పేర్కొంది. ఇదిలా ఉంటే సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా ఇప్పటికే ప్రకటించారు.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా వేరువేరు ప్రాంతాల నుంచి ఈ రైళ్ళను నడపనున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉండే సంక్రాంతి సందడిని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అసౌకర్యం లేకుండా చూస్తామని రైల్వే అధికారులు ప్రకటించారు.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ కాకినాడ టౌన్ హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నట్టు విజయవాడ డివిజన్ పి ఆర్ ఓ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటికి 32 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, జనవరి నాలుగో తేదీ మరొక నాలుగు ప్రత్యేక రైళ్లను కూడా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిందని, మళ్ళీ ఏపీ తెలంగాణా రాష్ట్రాల మధ్య మరో ఆరు రైళ్ళను కూడా నడుపుతామని రైల్వే అధికారులు పేర్కొన్నారు.దీంతో మొత్తం ప్రత్యేక రైళ్ళ సంఖ్య 42 కి చేరింది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications