విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్టీసీ సమ్మె: కార్మికులపై యాజమాన్యం కఠిన చర్యలు, దిగొచ్చిన సంఘాలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా, మంత్రులు, అధికారులు సమ్మె విరమించమని ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నా, సమ్మెను విరమించని ఆర్టీసీ కార్మికులపై యాజమాన్యం క్రమశిక్షణ నిబంధనల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

గుర్తింపు పొందిన ఆర్టీసీ సంఘాలకు డిపోల్లో ఉన్న ప్రత్యేక సదుపాయాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. క్రమశిక్షణా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన యాజమాన్యం రాష్ట్ర, జోనల్‌, జిల్లా, డిపో స్థాయిలో గుర్తింపు కార్మిక సంఘాలైన ఈయూ, టీఎంయూ, టీఎన్‌యూ, ఎన్‌ఎంయూలకు సౌకర్యాలు తొలగించినట్లు తెలిపింది.

దీంతో పాటు కార్మికుల వేతనాల నుంచి సభ్యత్వ రుసుమును మినహాయించే సదుపాయాన్ని తొలగిస్తున్నట్టు వివరించింది. ఈ నిర్ణయాలను వెంటనే అమలు చేయాలని రహదారి రవాణా సంస్థ ఎండీ ఆదేశాలు జారీ చేశారు.

APSRTC strike throws normal life out of gear in Andra Pradesh, Telangana

యూనియన్ నేతలు విధులకు రాకుండా, యూనియన్ కార్యకలాపాలకు పరిమితం చేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లు కూడా యాజమాన్యం ప్రకటించింది. సంస్ధ బస్సులను స్వయంగా ఉద్యోగస్తులే అడ్డుకోవడాన్ని తప్పు బట్టింది.

దిగొచ్చిన సంఘాలు, మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలకు సిద్ధమని ప్రకటన

ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న కఠిన చర్యలతో ఇబ్బందుల్లో పడతామని భావించిన కార్మిక సంఘాలు దిగొచ్చాయి. కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరడంతో యాజమాన్యం కఠిన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలకు సిద్ధమని ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించారు.

సమస్యలపై మాట్లాడి మధ్యే మార్గంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే, తాము సమ్మెను తక్షణం విరమించి విధుల్లోకి చేరేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాలతో టీటీడీ దేవస్ధానం అధ్యక్షుడు చదలవాడ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

వేసవి సెలవుల దృష్ట్యా రద్దీ ఎక్కువగా ఉన్నందున అన్ని డిపోల నుంచి తిరుపతికి బయలుదేరే బస్సు సర్వీసులను సమ్మె నుంచి మినహాయించాలని కోరారు. దీంతో యూనియన్ సభ్యులతో మాట్లాడి తమ నిర్ణయం వెల్లడిస్తామని కార్మిక సంఘాలు తెలిపాయి.

English summary
Normal life in Andhra Pradesh and Telangana was thrown out of gear for the second day on Friday after employees of Andhra Pradesh State Road Transport Corporation (APSRTC) continued with their strike for hike in salaries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X