APSRTC మరో గుడ్ న్యూస్- అడ్వాన్స్ రిజర్వేషన్-సోమవారం నుంచి మరిన్ని
ఏడాదికాలంగా కరోనా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఏపీఎస్‌ఆర్టీసీ త్వరలో వీటి నుంచి బయటపడేందుకు రంగం సిద్దం చేస్తోంది. కరోనా ఆంక్షలతో అధికశాతం బస్సులు డిపోలకే పరిమితమవుతున్న నేపథ్యంలో తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన కర్ఫ్యూ సడలింపులతో కాస్త ఊరట పొందబోతోంది. దీంతో సోమవారం నుంచి అమలయ్యేలా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఏపీలో సోమవారం నుంచి పగటి పూట కర్ఫ్యూను ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సోమవారం నుంచి దూరప్రాంత సర్వీసులను పూర్తి స్ధాయిలో నడపాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ కర్ఫ్యూ ఆంక్షల సడలింపు ఉండటంతో ఈ సమయాన్ని పూర్తి స్ధాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. దీంతో వీలైనన్ని ఎక్కువ దూరప్రాంత సర్వీసులు నడపనున్నారు. వివిధ జిల్లాల మధ్య నడిచే సర్వీసుల సంఖ్య పెరగనుంది. దీంతో ఆర్టీసీ రాబడి కూడా పెరగబోతోంది.

మరోవైపు దూర ప్రాంత సర్వీసులకు టికెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని కూడా సోమవారం నుంచి పునరుద్ధరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. కరోనా కారణంగా బస్సులు నిలిచిపోవడంతో అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయాన్ని కూడా నిలిపేశారు. ఇప్పుడు కర్ఫ్యూ ఆంక్షల సడలింపుతో అడ్వాన్స్ రిజర్వేషన్ కూడా తిరిగి ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే అన్ని బస్సు సర్వీసులు నడపనున్నారు.












Click it and Unblock the Notifications