APSRTC: ఊటీకి స్పెషల్ బస్: టికెట్, రిజర్వేషన్ వివరాలు ఇవే
రాయచోటి: పర్యాటకరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పర్యాటక కేంద్రాలకు ప్రత్యేక ప్యాకేజీలను అమలు చేస్తోంది. పర్యాటకాభివృద్ధి సంస్థ ఇప్పటికే దీనిపై పలు ప్యాకేజీలను అమలు చేస్తోంది. ఆధ్యాత్మిక-పర్యాటక ప్రాంతాలను కలుపుతూ పలు ప్యాకేజీలను ఏపీటీడీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటికి సందర్శకుల నుంచి మంచి డిమాండ్ లభిస్తోంది.
ఏపీటీడీసీ బాటలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎంట్రీ ఇచ్చింది. పర్యాటకాభివృద్ధి సంస్థ అమలు చేస్తోన్న టూరిజం ప్యాకేజీ తరహాలోనే ప్రయాణికుల కోసం ప్రత్యేక సౌకర్యాలను ప్రవేశపెడుతోంది. దీనికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తమిళనాడులోని అరుణాచలానికి మెజారిటీ డిపోల నుంచి బస్సులను నడిపిస్తోంది. అలాగే వేలాంకిణికీ స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

తమిళనాడులోని పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటక కేంద్రాలకు కూడా ప్రత్యేక బస్ సర్వీసులను ప్రవేశపెట్టడానికి శ్రీకారం చుట్టింది ఏపీఎస్ఆర్టీసీ. తాజాగా అన్నమయ్య రాయచోటి జిల్లాలోని మదనపల్లి నుంచి ఊటీకి ఈ స్పెషల్ బస్సను నడిపించనుంది. కోయంబత్తూరు, మెట్టుపాళ్యం మీదుగా రాకపోకలు సాగిస్తుంది ఈ సర్వీస్. ఈ నెల 10వ తేదీన అంటే బుధవారం రాత్రి 8 గంటలకు మదనపల్లి నుంచి ఈ బస్సు ఊటీకి బయలుదేరి వెళ్తుంది.
గురువారం ఉదయం 8 గంటలకు ఊటీకి చేరుకుంటుంది. సాయంత్రం 7.00 గంటలకు ఊటీ నుంచి మదనపల్లికి బయలుదేరుతుంది. మెట్టుపాళ్యంలో బ్లాక్ థండర్ థీమ్ పార్క్, కోయంబత్తూరులో సద్దురు ఈశా ఫౌండేషన్‌ను ఆది యోగి విగ్రహం సందర్శించే అవకాశం కల్పించింది. లేజర్ షో ముగిసిన అనంతరం కోయంబత్తూరు నుంచి మదనపల్లికి బస్సు బయలుదేరుతుంది. మరుసటిరోజు ఉదయం 8 గంటలకు మదనపల్లెకు చేరుకుంటుంది.

ప్రయాణీకులకు రాను పోను 2,250 రూపాయల ఛార్జీను వసూలు చేస్తామని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. రిజర్వేషన్ కోసం 99592 25677, 9160186645 నంబర్లను సంప్రదించాల్సి ఉంటుందని సూచించారు. గతంలో వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని విజయవాడ నుంచి అరకులోయకు వీకెండ్ స్పెషల్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది ఆర్టీసీ. దీనికి మంచి డిమాండ్ లభిస్తోందని తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications