విజయవాడ ప్రయాణికులకు శుభవార్త
ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తోన్నారు. వివిధ నగరాలు, జిల్లా కేంద్రాలకు అత్యాధునిక బస్సులను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. రద్దీ మార్గాల్లో వాటిని ప్రవేశపెడుతున్నారు. వాటికి ప్రయాణికుల నుంచి అపూర్వ స్పందన, వాటికి లభిస్తోన్న ఆదరణ, ఆక్యుపెన్సీ నేపథ్యంలో మరన్ని కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోన్నారు.
ఏసీ వెన్నెల స్లీపర్, నైట్ రైడర్, డాల్ఫిన్ క్రూయిజ్ పేరుతో ఏసీ సీటింగ్ కమ్ స్లీపర్ కోచ్ బస్సులను ప్రవేశపెట్టారు. వివిధ నగరాలు, జిల్లా కేంద్రాలకు ఈ బస్సులు పరుగులు పెడుతున్నాయి. వాటికి కూడా అంచనాలకు మించి ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోంది. వారాంతపు, సెలవు రోజుల్లో సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్యాకేజీ టూర్లు, ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలకు ప్రత్యే బస్సులను నడిపిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ.

- విజయవాడ నుంచి బెంగళూరుకు రాకపోకలు సాగించే వెన్నెల ఏసీ స్లీపర్ బస్ కూ ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో వీటి సర్వీసులను క్రమంగా పెంచుతున్నారు. ఈ క్రమంలో మరో వెన్నెల ఏసీ స్లీపర్ బస్సు అందుబాటులోకి వచ్చింది.
- ప్రతి రోజూ సాయంత్రం 5:10 నిమిషాలకు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి బయలుదేరే సర్వీస్ నంబర్ 3870 వెన్నెల ఏసీ స్లీపర్ బస్సు.. మరుసటి రోజు తెల్లవారు జామున 5:50 నిమిషాలకు బెంగళూరు శాంతినగర్ బస్ స్టేషన్ కు చేరుకుంటుంది.
- ప్రతి రోజూ సాయంత్రం 6:30 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరే నంబర్ 3871 వెన్నెల ఏసీ స్లీపర్ బస్సు మరుసటి రోజు ఉదయం 7:15 నిమిషాలకు విజయవాడకు చేరుకుంటుంది.
- గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి మీదుగా ఈ బస్సు రాకపోకలు సాగిస్తుంది. బెంగళూరులో హొస్కొటే, కృష్ణరాజపురం, ఐటీఐ గేట్, టిన్ ఫ్యాక్టరీ, ఇందిరా నగర్, బేగం మహల్, కెంపేగౌడ బస్ స్టేషన్ టెర్మినల్ 1 మీదుగా శాంతినగర్ కు చేరుకుంటుంది.












Click it and Unblock the Notifications