అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు: ఏపీ ట్రాన్స్‌కో రిక్రూట్‌మెంట్-2017

Subscribe to Oneindia Telugu

ఎలక్ట్రికల్, సివిల్ విభాగాల్లో రెగ్యులర్ పద్దతిలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకై ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పోరేషన్ లిమిటెడ్(ఏపీ- ట్రాన్స్‌కో) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 20, 2017 నుంచి ఏప్రిల్ 12, 2017 మధ్యలో దరఖాస్తు చేసుకోవాలి.

APTRANSCO Recruitment 2017 Apply for 146 Posts

ఏపీ ట్రాన్స్‌కో ఖాళీల వివరాలు:

మొత్తం పోస్టులు: 146
1) అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్): 136 పోస్టులు
2)అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 10 పోస్టులు

వయసు పరిమితి: మార్చి01, 2017నాటికి అభ్యర్థుల వయసు 42సం. మించరాదు. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5ఏళ్లు, వికలాంగులకు 10ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది.
విద్యార్హత: ఎలక్ట్రిక్ ఇంజనీర్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలక్ట్రిక్ లేదా ఎలక్ట్రానిక్ విభాగంలో బీఈ/బీటెక్/ఏఎంఐఈ పూర్తి చేసి ఉండాలి. సివిల్ ఇంజనీర్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సివిల్ ఇంజనీర్ లో బీఈ/బీటెక్ లేదా సంబంధిత విభాగంలో తత్సమాన అర్హత కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
దరఖాస్తు రుసుం: జనరల్ కేటగిరి అభ్యర్థులు రూ.500(రూ.150/-రిజిస్ట్రేషన్ రుసుం+ రూ.350 పరీక్ష ఫీజు) చెల్లించి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/వికలాంగులు రూ.150 ఫీజ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు విధానం: ఏపీ ట్రాన్స్‌కో అధికారిక వెబ్ సైట్ ద్వారా అర్హత గల అభ్యర్థులు మార్చి 20, 2017 నుంచి ఏప్రిల్ 12, 2017 మధ్యలో దరఖాస్తు చేసుకోవాలి.
మరిన్ని వివరాలకు:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Transmission Corporation Limited (APTRANSCO) has published notification for the recruitment of 146 Assistant Engineer (Electrical & Civil) vacancies on regular basis.
Please Wait while comments are loading...