వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చచ్చినా వైసీపీలో చేరను, ఆత్మాభిమానం చంపుకోలేను: ఎంపీ కొత్తపల్లి గీత

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: చచ్చినా కానీ, వైసీపీలో చేరనని అరకు ఎంపీ కొత్తపల్లి గీత స్పష్టం చేశారు. తన ఆత్మాభిమానాన్ని చంపుకోనని ఆమె తేల్చి చెప్పారు. అయితే సాంకేతికంగా తాను ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నానని ఆమె చెప్పారు. తనను స్వతంత్ర ఎంపీగా చూడాలని ప్రివిలేజ్ కమిటీని కోరినట్టు గీత చెప్పారు.

2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా అరకు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసిన కొత్తపల్లి గీత విజయం సాధించారు. అయితే కొంతకాలానికే ఆమె వైసీపీకి దూరమయ్యారు. టిడిపికి దగ్గరౌతున్నారనే ప్రచారం కూడ సాగింది. కానీ, ఆమె ఆ పార్టీతో కూడ అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు.

పార్లమెంట్ సమావేశాల్లో కొత్తపల్లిగీత హజరుశాతం సుమారు 97 శాతంగా ఉంది. అయితే ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ఆమె చెబుతోంది. 2019 ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీచేస్తారనే విషయాన్ని కూడ ఆమె స్పష్టం చేయలేదు. ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను కొత్తపల్లి గీత వెల్లడించారు.

వైసీపీలో చేరే ప్రసక్తేలేదు

వైసీపీలో చేరే ప్రసక్తేలేదు

2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించినప్పటికీ ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉంటున్నట్టు అరకు ఎంపీ కొత్తపల్లి గీత ప్రకటించారు. అయితే సాంకేతికంగా తాను వైసీపీలోనే ఉన్నానని ఆమె చెప్పారు. కానీ, వైసీపీ నాయకత్వం అనుసరించిన తీరుతోనే ఆ పార్టీకి దూరమయ్యాయని ఆమె చెప్పారు. అయితే రానున్న రోజుల్లో కూడ వైసీపీలో చేరే ప్రసక్తే లేదని ఆమె చెప్పారు.తన ఆత్మాభిమానాన్ని చంపుకోలేనని ఆమె స్పష్టం చేశారు.

స్వతంత్ర అభ్యర్థిగా చూడాలని ప్రివిలేజ్ కమిటీని కోరా

స్వతంత్ర అభ్యర్థిగా చూడాలని ప్రివిలేజ్ కమిటీని కోరా


వైసీపీతో పాటు ఏ పార్టీలో తాను లేనని కొత్తపల్లి గీత చెప్పారు. అయితే తనను స్వతంత్ర ఎంపీగా చూడాలని ప్రివిలేజీ కమిటీని కోరినట్టు ఆమె చెప్పారు. అయితే ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్టు ఆమె చెప్పారు.ఆ కమిటీ నిర్ణయం మేరకు తాను నడుచుకొంటానని ఆమె చెప్పారు.

గిఢ్డీ ఈశ్వరితో వ్యక్తిగత విభేదాలు లేవు

గిఢ్డీ ఈశ్వరితో వ్యక్తిగత విభేదాలు లేవు

గిడ్డీ ఈశ్వరితో తనకు వ్యక్తిగత విభేధాలు లేవని అరకు ఎంపీ కొత్తపల్లి గీత చెప్పారు.ఈశ్వరీ కూడ టిడిపిలో చేరారని, ఒకవేళ తాను టిడిపిలో చేరితే ఈశ్వరీతో ఇబ్బందులు వస్తాయనే వాదనను ఆమె తోసిపుచ్చారు. తనను ఎవరూ కూడ ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉండవని ఆమె చెప్పారు.

రాజకీయాల్లోకి వచ్చి తీవ్రంగా నష్టపోయా

రాజకీయాల్లోకి వచ్చి తీవ్రంగా నష్టపోయా


రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తీవ్రంగా నష్టపోయానని అరకు ఎంపీ కొత్తపల్లి గీత చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్ని రకాలుగా దెబ్బతిన్నట్టు చెప్పారు. వ్యాపారాల కోసం రాజకీయాలను అడ్డుపెట్టుకోలేదని ఆమె చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణం కూడ చెల్లించేందుకు తమ కుటుంబం ప్రయత్నాలు చేస్తోందని ఆమె చెప్పారు.

English summary
Araku YCP MP Kothapalli Geetha while speaking in a maha tv programme said she is officially in YCP at present but not participating in party activities because of the party's defamation,her character assassination
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X