తన కంటే 17 ఏళ్ల చిన్నోడితో డేటింగ్.. రియాక్ట్ అయిన స్టార్ బ్యూటీ !!
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 50 ఏళ్ల వయసులోనూ తరగని అందం, అద్భుతమైన ఫిట్‌నెస్‌తో ఆమె ఇప్పటికీ యువ నటీమణులకు పోటీ ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్‌కు పెట్టింది పేరు ఈ అమ్మడు. గతంలో మలైకా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ని పెళ్లి చేసుకొని.. ఆ తర్వాత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
1998లో వచ్చిన దిల్ సె సినిమాలో షారుక్ ఖాన్‌తో చేసిన "చయ్యా చయ్యా" పాట ఆమెకు భారీ పాపులారిటీ తెచ్చింది. తరువాత కాంటేలో "మహి వే", దబాంగ్లో "మున్నీ బద్నామ్", దబాంగ్ 2లో "పాండే జీ సీటీ" వంటి సూపర్‌హిట్ సాంగ్స్‌లో కనిపించింది. అలానే తెలుగులో కూడా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీలో కెవ్వు కేక సాంగ్ తో ఫుల్ క్రేజ్ సంపాదించింది. అలాగే రీసెంట్ గా కూడా పలు చార్ట్ బస్టర్స్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.

కాగా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మలైకా అరోరా నటుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలవలేదు. మనస్పర్థల కారణంగా 2017లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మలైకా తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన నటుడు అర్జున్ కపూర్‌తో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ పలు ఈవెంట్లకు, వెకేషన్లకు కలిసి హాజరై వార్తల్లో నిలిచారు. అయితే వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అందరూ భావించిన తరుణంలో, ఊహించని విధంగా అర్జున్ కపూర్‌తో ఆమె బ్రేకప్ చేసుకున్నారు.
అయితే ఇప్పుడు మలైకా అరోరా ప్రస్తుతం హర్షా మెహతా అనే వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ హర్షా మలైకా కంటే 17 ఏళ్లు చిన్నవాడని సమాచారం. అర్జున్ కపూర్ కూడా మలైకా కంటే వయసులో చిన్నవారే అయినప్పటికీ.. ఇతను మరింత చిన్నవాడు కావడం హాట్ టాపిక్ అవుతోంది. సినీ వర్గాల్లో నడుస్తున్న టాక్ ప్రకారం.. హర్ష మెహతా డైమండ్ వ్యాపారి అని.. మలైకాకు కూడా మేనేజర్ గా కూడా ఉన్నారని చెబుతున్నారు. అయితే ఈ వార్తలపై మలైకా అరోరా కానీ, హర్షా మెహతా కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.
ఇక వీరిద్దరి ప్రేమాయణం గురించి నెట్టింట ప్రచారం జరగడంతో ఆమెపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ నడిచింది. ఈ మేరకు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మలైకా మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్‌పై ఓపెన్ అయ్యారు. ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో, తాను తన చుట్టూ ఒక సరిహద్దును సృష్టించుకున్నానని ఆమె వివరించారు. ఇది బయటి గందరగోళం నుండి తనను తాను కాపాడుకోవడానికి, దాని ప్రభావం తనపై పడకుండా చూసుకోవడానికి సహాయపడుతుందని ఆమె తెలిపారు. ఇన్నేళ్లుగా తాను నేర్చుకున్నది ఒకటే అని.. ఇతరుల అభిప్రాయాల కోసం మనశ్శాంతిని త్యాగం చేస్తే.. ఎప్పటికీ శాంతి లభించదని తెలిపారు.
నేను నా నిజ జీవితం, నా పని, నా కుటుంబం, నా దైనందిన జీవితం అనుకోని బ్రతకాలని హితవు పలికారు. అంతే కాకుండా ప్రతి చిన్న విషయానికి స్పందించడం మానేయాలని.. ట్రోల్ చేయడం అనేది వినేవారి కంటే, చేసే వ్యక్తి గురించే ఎక్కువగా చెబుతుందని గ్రహించాలన్నారు.












Click it and Unblock the Notifications