ప్రతిభకు పట్టం : ఏపీ భవన్ మీడియా ఓఎస్డీగా సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ యాదవ్
అమరావతి/న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఏపీ భవన్ మీడియా వ్యవహారాల ఓఎస్డీని ఏపీ ప్రభుత్వం నియమించింది. సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ యాదవ్‌ను ఓఎస్డీగా ఖరారు చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం జీవో జారీ చేశారు. మీడియాలో అరవింద్ యాదవ్‌కు మంచి అనుభవం ఉంది. ఆయన హిందీలో పలు పుస్తకాలను కూడా రచించారు.

సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ యాదవ్‌ను ఏపీ భవన్ మీడియా వ్యవహారాల ఓఎస్డీగా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఢిల్లీలోని ఏపీ భవన్ కేంద్రంగా అరవింద్ యాదవ్ విధులు నిర్వర్తిస్తారు. అరవింద్ యాదవ్‌కు మీడియాలో విశేష అనుభవం ఉంది. గత 24 ఏళ్లుగా వివిధ చానెళ్లు, వెబ్‌సైట్లలో పనిచేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మీడియా సంస్థలలో కీలక బాధ్యతలు చేపట్టారు అరవింద్ యాదవ్.

జాతీయ మీడియా సంస్థలు ఆజ్‌తక్, ఐబీఎన్‌లో దక్షిణ భారత వ్యవహారాల పాత్రికేయుడిగా పనిచేశారు. టీవీ 9, సాక్షి టీవీలో పనిచేశారు. యువర్ స్టోరీ మీడియాలో ఎడిటర్‌గా విధులు నిర్వర్తించారు. అరవింద్ యాదవ్ మంచి రచయిత కూడా. పలు హిందీ పుస్తకాలను కూడా రచించారు.












Click it and Unblock the Notifications