గోల్కొండ కోట: సాయుధ బలగాల రిహార్సల్స్(పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారిగా గోల్కొండ కోట వద్ద ఆగస్టు 15న జాతీయ జెండాను ఎగురవేయనున్న నేపథ్యంలో పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు మూడు రోజుల నుంచి అక్కడ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రిహార్సల్ కూడా నిర్వహిస్తున్నారు. బుధవారం కూడా పోలీసులు తమ రిహార్సల్స్‌ను కొనసాగించారు.

గోల్కొండ కోట వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తు కోసం సుమారు 5000 మంది పోలీసు సిబ్బంది సేవలు వినియోగించుకుంటున్నారు. కోటకు చుట్టూ ఐదు కిలోమీటర్ల పొడవునా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మూడు రోజులుగా డిజిపి అనురాగ్ శర్మ, పోలీస్ కమిషనర్ ఎం మహేందర్ రెడ్డి, అదనపు సిపిలు అంజనీకుమార్, జితేందర్, పశ్చిమ మండలం డిసిపి సత్యనారాయణ భద్రతపై దృష్టి సారించారు. విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.

మహావీర్ ఆస్పత్రి నుంచి గోల్కొండ కోట వరకు 2000 మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, ఎస్‌బి, సిఏఆర్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సిఆర్పిఎఫ్, తెలంగాణ స్టేట్ పోలీస్, సిటి సెక్యూరిటీ వింగ్ బృందాలు రెండు వారాలుగా భద్రతపై కసరత్తు చేస్తున్నాయి.

గోల్కొండ కోట వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కోట లోపల భాగాన్ని 25 సెక్టార్లుగా విభజించారు. ఒక్కో సెక్టార్‌ను 25 మంది సిబ్బందితో ఏర్పాటు చేసిన టీమ్ పర్యవేక్షిస్తుంది. కేవలం కోట లోపలి భద్రత కోసమే సుమారు 1200 మంది పోలీసు సిబ్బంది సేవలు వినియోగిస్తున్నారు.

రిహార్సల్స్

రిహార్సల్స్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారిగా గోల్కొండ కోట వద్ద ఆగస్టు 15న జాతీయ జెండాను ఎగురవేయనున్న నేపథ్యంలో పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రిహార్సల్స్

రిహార్సల్స్

రెండు మూడు రోజుల నుంచి అక్కడ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రిహార్సల్ కూడా నిర్వహిస్తున్నారు.

రిహార్సల్స్

రిహార్సల్స్

బుధవారం కూడా గోల్కొండ కోట వద్ద పోలీసులు తమ రిహార్సల్స్‌ను కొనసాగించారు.

రిహార్సల్స్

రిహార్సల్స్

స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో గోల్కొండ కోట వద్ద పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

రిహార్సల్స్

రిహార్సల్స్

బందోబస్తు కోసం సుమారు 5000 మంది పోలీసు సిబ్బంది సేవలు వినియోగించుకుంటున్నారు.

రిహార్సల్స్

రిహార్సల్స్

కోటకు చుట్టూ ఐదు కిలోమీటర్ల పొడవునా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

రిహార్సల్స్

రిహార్సల్స్

మూడు రోజులుగా డిజిపి అనురాగ్ శర్మ, పోలీస్ కమిషనర్ ఎం మహేందర్ రెడ్డి, అదనపు సిపిలు అంజనీకుమార్, జితేందర్, పశ్చిమ మండలం డిసిపి సత్యనారాయణ భద్రతపై దృష్టి సారించారు.

రిహార్సల్స్

రిహార్సల్స్

మహావీర్ ఆస్పత్రి నుంచి గోల్కొండ కోట వరకు 2000 మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

రిహార్సల్స్

రిహార్సల్స్

కౌంటర్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, ఎస్‌బి, సిఏఆర్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సిఆర్పిఎఫ్, తెలంగాణ స్టేట్ పోలీస్, సిటి సెక్యూరిటీ వింగ్ బృందాలు రెండు వారాలుగా భద్రతపై కసరత్తు చేస్తున్నాయి.

రిహార్సల్స్

రిహార్సల్స్

గోల్కొండ కోట వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కోట లోపల భాగాన్ని 25 సెక్టార్లుగా విభజించారు. ఒక్కో సెక్టార్‌ను 25 మంది సిబ్బందితో ఏర్పాటు చేసిన టీమ్ పర్యవేక్షిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+