అనుమానం పెనుభూతమై.... ముగ్గురు ప్రాణాలు తీసింది

Subscribe to Oneindia Telugu

కర్నూలు: అనుమానం పెనుభూతమై య్యింది. ఒకరు కాదు ముగ్గురు ఈ అనుమానానికి బలయ్యారు. అనుమానం తో భార్యను చంపింది గాక తన కూతురిని చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ రైతు. కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనాకేరి గ్రామంలో ఘోరం చోటుచేసుకుంది.

భార్యపై అనుమానం పెంచుకున్న బర్త నాగప్ప రాత్రి భార్యపై గొడవ పడ్డాడు. రాత్రికి బాగానే ఉన్న నాగప్ప ఈ రోజు తెల్లవారుజామున నిద్రిస్తున్న భార్య సుశీల ను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపాడు.

armer has killed his wife and daughter and comitted suicide

ప్రక్క గది లో నిద్రిస్తున్న కూతుర్ని కూడా చంపాడు. ఇద్దరిని నరికి చంపిన నాగప్ప ఇంటి నుండి బయటకు వెళ్ళాడు. నేరుగా పొలానికి వెళ్లి పొలం లో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడం తో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A farmer has killed his wife and daughter and comitted suicide at Adoni in Kurnool disrict of Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X