మనస్తాపంతోనే: అప్పలరాజు మృతిపై ఆర్మీ స్పందన
హైదరాబాద్: ఆర్మీ జవాను అప్పల్రాజు మృతిపై సైన్యం స్పందించింది. హైదరాబాదులోని మెహదీపట్నం క్యాంప్‌వలో సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని అప్పల్రాజు మరణించాడని చెప్పిన సైన్యం తమకు అతని నుంచి ఏ విధమైన ఆత్మహత్య లేఖ అందలేదని తెలిపింది.
ముస్తఫా కేసులో పోలీసులు 70 మంది జవాన్లను ప్రశ్నించారని, ఈ కేసును పోలీసు, సైనిక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని తెలిపింది. ఈ కేసులో అప్పల్రాజుకు సంబందం ఉందనే వార్తలు నిరాధారమేనని స్పష్టం చేసింది. సిట్ విచారణతో మనస్తాపానికి గురయ్యే అప్పలరాజు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని సైన్యం అభిప్రాయపడింది. పోలీసులు, సైన్యం విచారణ పేరుతో రోజుల తరబడి వేధించడం వల్లనే తన భర్త మరణించాడని అప్పలరాజు భార్య అనసూయ ఆరోపించిన నేపథ్యంలో సైన్యం ఆ ప్రకటన చేసింది.

మెహిదీపట్నంలోని ఆర్మీ క్యాంపులో అప్పలరాజు అనే జవాను ఆత్మహత్య చేసకున్న విషయం తెలిసిందే. రైఫిల్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల ముస్తఫా అనే బాలుడి మృతి కేసులో అప్పలరాజును సిట్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. మనస్తాపంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
జవాను మృతదేహాన్ని మిలటరీ ఆసుపత్రిలో ఉంచినట్లు మిలటరీ అధికారులు తెలిపారు. మృతుడు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. జవాను మృతి పైన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సంఘటన స్థలం వద్దకు హుమాయున్ నగర పోలీసులు వచ్చారు. పోలీసులు రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications