Arnab తుఫాను అలజడి, ప్రయాణాలు వద్దు - అత్యంత భారీ వర్షాలు, ప్రభుత్వం ఆదేశాలు..!!

ఏపీ వైపు తుఫాను దూసుకొస్తోంది. పదేళ్ల కాలంలో వస్తున్న అత్యంత తీవ్రమైన తుఫానుగా ఆర్నాబ్ ను వాతావరణ శాఖ పేర్కొంటోంది. కోనసీమ ప్రాంతానికి భారీ ముప్పు పొంచి ఉందని అంచనా వేస్తున్నారు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసారు. ఈ తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికా రులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం సైతం అప్రమత్తం అయింది. కీలక సూచనలు చేసింది.

బంగాళాఖాతంలో 'అర్నబ్' తుఫాన్‌ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత అప్రమత్తం చేశారు. ఇవాళ (సోమవారం) అర్ధరాత్రికి తీవ్ర తుఫాన్‌గా.. రేపటికి అతి తీవ్ర తుపానుగా 'అర్నబ్' మారనుంది. ఎల్లుండి ఉదయం బాపట్ల - విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీంతో వాతావరణం ప్రశాంతంగా ఉందనే అపోహలతో అలసత్వం వహించవద్దని ప్రజలకు అనిత సూచనలు చేశారు. రేపు, ఎల్లుండి అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించారు. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కి.మీ.వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని హోంమంత్రి తెలిపారు. ప్రభావిత జిల్లాలకు ఇప్పటికే NDRF, SDRF బృందాలు చేరుకున్నాయని, సోషల్ మీడియా వదంతులను నమ్మవద్దని సూచించారు.

పిఠాపురంలో జనసేనకు డేంజ'రెబల్స్'.. కొత్త బాధ్యతల్లో వర్మ - మారుతున్న లెక్కలు..!!
పిఠాపురంలో జనసేనకు డేంజ'రెబల్స్'.. కొత్త బాధ్యతల్లో వర్మ - మారుతున్న లెక్కలు..!!
arnab-cyclone-to-intensify-into-extremely-severe-storm-likely-to-cross-coast-between-bapatla-and-vi

అత్యంత భారీ వర్షాలు.. ప్రభుత్వం అప్రమత్తం

కాగా.. ఏపీఎస్‌డీఎమ్‌ఏ, ఆర్టీజీఎస్ ప్రభుత్వ అధికారిక సమాచారాన్నే పాటించాలని వెల్లడించారు. తీరప్రాంత ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత నిర్దేశించారు. అక్టోబర్ 26 తెల్లవారుజామునాటికి తుఫానుగా మారే అవకాశం ఉంది. అనంతరం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ అక్టోబర్ 27 నాటికి తీవ్ర తుఫానుగా, ఆ తర్వాత అతి తీవ్ర తుఫానుగా బలపడే సూచనలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠంగా గంటకు 140 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా. తుఫాను ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+