అన్నీనెరవేరుస్తాం: తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు జైట్లీ హామీ
న్యూఢిల్లీ: ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరువేరుస్తామని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం తెలిపారు. అంతేగాక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి కూడా కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారు.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని జైట్లీ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్రం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పునర్విభజన బిల్లు చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ అభివృద్ధికి ఎన్డీయే కట్టుబడి ఉందని, తెలంగాణలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఆయా మంత్రిత్వశాఖలు, అధికార యంత్రాంగం సకాలంలో చేపడతాయన్నారు.
ఏపీ, టీలకు ఇచ్చినవి ఇవే..
ఏపీకి... కాకినాడ కేంద్రంగా హార్డ్ వేర్ పార్క్, హిందూపురంలో నేషనల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీ, కాకినాడ పోర్టు అభివృద్ధికి ప్రోత్సాహకాలు, ఎయిమ్స్, ఐఐటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ - ప్రత్యేక నిధులు, విశాఖ - చెన్నైల మధ్య పారిశ్రామిక కారిడార్, తెలంగాణకు ఉద్యానవన విశ్వవిద్యాలయం, హైదరాబాదులో డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఏర్పాటు.

బడ్జెట్ ప్రసంగం అనంతరం లోకసభ సమావేశాలు రేపటి(శుక్రవారం)కి వాయిదా పడ్డాయి. గురువారం ఉదయం సభ ప్రారంభంకాగానే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సాధారణ బడ్జెట్‌ను లోకసభలో ప్రవేశపెట్టారు. రెండు గంటల పాటు అరుణ్‌జైట్లీ బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications