వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్యం ఏరులై పారుతుంటే నేనేం చేయగలను- జగన్ పేరుతోనూ : మంత్రి జయరాం మరో కాంట్రావర్సీ ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న మంత్రి జయరాం మరో సారి కాంట్రవర్సీ కామెంట్స్ చేసారు. మంత్రి ఒక ఎస్సైకు ఫోన్ చేసిన ఆడియో వైరల్ అయింది. దీంతో..తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను జయరాం కలిశారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన జయరాం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ఈ సారి తన గురించే కాదు.. ఏకంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి. కర్నూలు జిల్లా నుంచి మంత్రిగా ఉన్న గుమ్మనూరి జయరాం ఈ రెండున్నారేళ్ల కాలంలో ఏ మంత్రి ఎదుర్కోని వివాదాలు ఫేస్ చేయాల్సి వచ్చింది.

SamanthaAkkineni: స్మైలీ బ్యూటీ సామ్ ఇంట హాట్ గా ఎపుడు చూసి ఉండరు (ఫొటోస్)

వివాదాలకు చిరునామాగా మంత్రి జయరాం

వివాదాలకు చిరునామాగా మంత్రి జయరాం

కర్నూలు జిల్లా లోని తన నియోజకవర్గ పరిధిలో పేకాట క్లబ్ నిర్వహణ పైన అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో...మంత్రి బంధువుల పైనే పోలీసులు కేసు నమోదు చేసారు. ఆ తరువాత ఏసీబీ విచారిస్తున్న ఈఎస్సై స్కాం బయట పడిన సమయంలో.. ఓ నిందితుడి నుంచి బెంజ్‌ కారును నజరానాగా పొందారనే ఆరోపణలు వచ్చాయి. వీటిని టీడీపీ అస్త్రంగా మలచుకుంది. ఈ అంశం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు. దీనికి సంబంధించి ఏం జరిగింది...విమర్శల్లో వాస్తవం ఏంటనే దాని పైన ఆయన పార్టీలో ముఖ్యులకు వివరణ ఇచ్చుకోవటం ద్వారా ఆ సమస్య నుంచి బయట పడ్డారు.

ఎస్సైని బెదిరించారంటూ ఆడియో వైరల్

ఎస్సైని బెదిరించారంటూ ఆడియో వైరల్

తాజాగా మంత్రి హోదా లో ఉన్న జయరాం పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను వదిలేయాని ఒక ఎస్సైను బెదిరించిన ఆడియో బయటకు వచ్చింది. తాను చెప్పినట్లుగా వారిని వదిలేయకుంటే తాను ధర్నకు దిగుతానంటూ ఎస్సైని మంత్రి హెచ్చరించారు. ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. దీంతో..మంత్రి స్వయంగా ఈ రకంగా వ్యవహరించటం ఏంటంటూ ప్రతిపక్షాలు దీనిని ప్రభుత్వం పైన విమర్శలకు అవకాశంగా మలచుకున్నాయి. మంత్రి జయరాం అసలు తన నియోజకవర్గంలో ఇసుక రీచ్ లే లేవని...రీచ్‌లే లేనప్పుడు అక్రమ ఇసుక తవ్వకాలకు ఆస్కారం ఎక్కడదని ప్రశ్నిస్తున్నారు.

తాను ఏ తప్పు చేయలేదంటూ వివరణ

తాను ఏ తప్పు చేయలేదంటూ వివరణ

ఖాళీ ట్రాక్టర్లను పట్టుకుని రైతులను పోలీసులు ఇబ్బంది పెడుతుంటే ప్రజాప్రతినిధిగా స్పందించానని మంత్రి జయరామ్‌ వివరణగా ఉంది. అయితే, అప్పటికే రాజకీయంగా మంత్రికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక, తాజాగా మంత్రి జయరాం చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి. దందాగిరీ చేయడానికి నేనేమీ అంతరాష్ట్ర స్మగ్లర్ వీరప్పన్‌ను కాదంటూ మంత్రి చెప్పుకొచ్చారు. పోలీసులకు ఖాళీ ఇసుక ట్రాక్టర్లు పట్టుకుంటే వదిలేయండి అని చెప్పిన మాట వాస్తవమేనంటూ చెప్పారు. తాను దౌర్జన్యంగా మాట్లాడలేదని వివరించారు. తన పైన బురదజల్లే విధంగా వ్యవహరించవద్దంటూ కోరారు.

సీఎం జగన్ ను కలిసి సంజాయిషీ..

సీఎం జగన్ ను కలిసి సంజాయిషీ..

తాను సీఎం జగన్ ను కలిసానని.. అయితే, నియోజకవర్గ సమస్యల పైనే చర్చించానని చెప్పుకొచ్చారు. ఇతర అంశాలు ప్రస్తావనకు రాలేదని స్పష్టం చేసారు. లోకేశ్ తన పైన చేసిన విమర్శలకు స్పందించారు. అసలు లోకేశ్ కు మాట్లాడే యోగ్యతే లేదని కొట్టి పారేసారు. తన నియోజకవర్గం కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉంటుందని.. మద్యం సేవించేవారు అక్కడికి వెళ్లి మద్యం తెచ్చుకుంటున్నారన్నారు. మద్యం ఏరులై పారుతుంటే నేనేం చేయగలను అంటూ మంత్రి హోదాలో జయరాం వ్యాఖ్యానించారు.

జగన్ సీఎంగా ఉన్నంత వరకూ ఏం చేయలేంటూ

జగన్ సీఎంగా ఉన్నంత వరకూ ఏం చేయలేంటూ


అంతటితో ఆగకుండా సీఎంగా జగన్ ఉన్నంత వరకూ తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ జయరాం వ్యాఖ్యానించటం ఇప్పుడు అసలు వివాదంగా మారుతోంది. మంత్రి పైన విమర్శలు వచ్చిన సమయంలో వివరణ ఇచ్చుకుంటూ..రాజకీయంగా తిప్పి కొట్టాల్సిన సమయంలో సీఎం తన వెనుక ఉన్నారనే విధంగా మంత్రి వ్యాఖ్యానించటం పైన వైసీపీలోనే చర్చ మొదలైంది. జయరాం వ్యాఖ్యలతో ఇప్పుడు ప్రతిపక్షాలు ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వాన్ని కార్నర్ చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ప్రతిపక్షాలక మరో సారి మంత్రి చిక్కినట్లేనా

ప్రతిపక్షాలక మరో సారి మంత్రి చిక్కినట్లేనా

ఇప్పుడు మంత్రి వ్యాఖ్యల పైన అధికార పార్టీ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి. ఇక, త్వరలో మంత్రి వర్గ ప్రక్షాళన ఉంటుందని చెబుతున్న సమయంలో..మంత్రి జయరాం ఈ రకంగా వ్యవహరించటం.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ద్వారా తన పదవికే ఇబ్బంది తెచ్చుకుంటున్నారనే వాదన వైసీపీలోనే వినిపిస్తోంది. మరి..మంత్రి తీరు పైన సీఎం జగన్ ఏ రకంగా రియాక్ట్ అవుతారు.. మంత్రి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
AP Minister Jarayam Controversy comments on liquor issue and allegation against him. The confident Jayaram says nothing will happen to him as long as Jagan is CM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X