తెలుగురాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు : రాష్ట్రపతి ఆమోదం..!!
ఏపీ- తెలంగాణ హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసారు. ఏపీకి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా..తెలంగాణకు జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నియమితులు అయ్యారు. ఈ ఇద్దరి పేర్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం సెప్టెంబరు 16న సిఫార్సు చేసింది. రాష్ట్రపతి ఈ సిఫార్సులకు ఆమోద ముద్ర వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఎనిమిది రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులయ్యారు.

ఏపీ హైకోర్టు సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్రా
ప్రస్తుతం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ ఏకే గోస్వామి ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ కానున్నారు. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ హిమాకోహ్లీ ఆగస్టు 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆ స్థానంలో జస్టిస్ ఎం.ఎస్.ఆర్.రామచంద్రరావు తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు.

సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు
ఇప్పుడు ఆయన పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ తెలంగాణ హైకోర్టు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఏపీహైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రానున్న జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర 1964 ఆగస్టు 29న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో జన్మించారు. 2005 జనవరిలో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ద్వారా సీనియర్ న్యాయవాది హోదాను పొందారు. ఆ రాష్ట్ర బార్‌కౌన్సిల్ ఛైర్మన్‌గానూ పనిచేశారు.

తెలంగాణ హైకోర్టు సీజేగా సతీష్ చంద్ర శర్మ
ఆ రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్‌గా సేవలందించారు. ఆ తర్వాత అడ్వొకేట్ జనరల్‌గా పదోన్నతి పొందారు. 2009 డిసెంబరు 10న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ హైకోర్టుకు మూడో ప్రధాన న్యాయమూర్తిగా రానున్నారు. ఇక, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సతీష్ చంద్ర శర్మ 1961 నవంబరు 30న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జన్మించారు. 1984లో ఎల్‌ఎల్‌బీ డిగ్రీని పొందారు.

రాష్ట్రపతి ఆమోదం...నియామకం
మూడు బంగారు పతకాలు సాధించారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌చేసి రాజ్యాంగ, సర్వీస్, సివిల్, క్రిమినల్ కేసుల్లో ప్రావీణ్యత సాధించారు. 42 ఏళ్ల వయసులోనే 2003లో మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి సీనియర్ న్యాయవాది హోదాను పొందారు. 2008 జనవరి 18న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 జనవరి 15న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. భోపాల్ నేషనల్ లా యూనివర్సిటీ అడ్వయిజరీ బోర్డులో సభ్యులుగా కొనసాగుతున్నారు.

రెండు హైకోర్టులకు పూర్తి స్థాయి సీజేలు
ఇటీవల కర్ణాటక సీజేగా ఉన్న అభయ్‌శ్రీనివాస్ ఓక్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆగస్టు 31 నుంచి జస్టిస్ సతీష్‌చంద్రశర్మ ఆ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరి నియామకం పైన అధికారికంగా రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడటంతో త్వరలోనే వీరు బాధ్యతలు స్వీకరించనున్నారు.












Click it and Unblock the Notifications