బాబుతో అశోక్: గవర్నర్‌తో పద్మాదేవేందర్ భేటీ(పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఎపి ఎన్జీవోల అధ్యక్షుడు పి. అశోక్ బాబు మంగళవారంనాడు కలిశారు. సమైక్యాంధ్ర కోసం అశోక్ బాబు పోరాటం చేసిన విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.
ఇదిలావుంటే, తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. మర్యాదపూర్వకంగానే ఆమె గవర్నర్‌ను కలిసినట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే, బిజెపి నాయకులు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టివీ9 చానెళ్ల ప్రసారాలను తెలంగాణలో నిషేధించిన ఎస్ఎంవోలపై చర్యలు తీసుకోవాలని వారు గవర్నర్‌ను కోరారు. తెలంగాణ ప్రజలను, ప్రజాప్రతినిధులను కించపరిచారనే ఆరోపణపై ఆ చానెళ్ల ప్రసారాలను నిలిపేసిన విషయం తెలిసిందే.

మీడియాతో అశోక్ బాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత ఎపిఎన్జీలో సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు.

మీడియాతో అశోక్ బాబు
సమైక్యాంధ్ర కోసం పోరాటం చేసిన ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు మంగళవారంనాడు చంద్రబాబు నాయుడిని కలిశారు.

గవర్నర్‌తో బిజెపి నేతలు
బిజెపి నాయకులు గవర్నర్ నర్సింహన్‌ను మంగళవారంనాడు కలిసి రెండు టీవీ చానెళ్ల ప్రసారాలను నిలిపేసిన ఎస్ఎంవోలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

గవర్నర్‌తో పద్మా దేవేందర్ రెడ్డి
తెలంగాణ శానససభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మంగళవారంనాడు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు.












Click it and Unblock the Notifications