ప్రభుత్వ ఆస్తుల తాకట్టు వైసీపీ కుట్ర; కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు అశోక్ గజపతి రాజు చురకలు!!
టిడిపి నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు అటు కేంద్ర ప్రభుత్వం పై, ఇటు ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ధరల మంటతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అశోక్ గజపతిరాజు అసహనం వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలను అదుపులో పెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు వైషమ్యాలు లేకుండా పని చేయాలని సూచించారు అశోక్ గజపతి రాజు.

గ్యాస్ ధరల పెంపు .. తగ్గించాల్సింది కేంద్రమే
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఏపీలో బీజేపీ నేతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా బిజెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించడానికి అశోక్ గజపతిరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని విషయాలలో స్ఫూర్తిగా ఉన్నా, చాలా విషయాలను విమర్శలను ఎదుర్కొంటున్నారు అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. గ్యాస్ ధరల పెంపుతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చలేదని అందుకే తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశానని అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు.

తాకట్టుల వ్యవహారం ప్రపంచంలోనే ఎక్కడా లేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాష పై కుట్ర జరుగుతోందని విమర్శించిన అశోక్ గజపతి రాజు ప్రపంచమంతా తల్లి భాషలోనే విద్యను కొనసాగిస్తుంటే ఏపీలో మాత్రం తెలుగు భాషకు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆస్తులను తాకట్టు పెడుతోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అశోక గజపతి రాజు. ఈ తాకట్టుల వ్యవహారం ప్రపంచంలోనే ఎక్కడా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ ప్రభుత్వం ప్రజా సౌకర్యాలను తాకట్టు పెడుతున్న తీరును చూసి, చివరికి జిల్లా కలెక్టర్ కార్యాలయాలను కూడా తాకట్టు పెడతారా అంటూ అశోక్ గజపతిరాజు ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.

రాష్ట్రం అప్పులపాలు .. ప్రజల ఆస్తులు తాకట్టుల పాలు
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు వైసిపి సర్కార్ వైజాగ్ లోని ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆదాయం సృష్టించలేక, వైజాగ్ లోని ప్రజల ఆస్తులను జగన్ తాకట్టు పెడుతున్నారంటూ విమర్శిస్తున్నారు. జగన్ లోటస్ పాండ్ లోని భవనాన్ని, బెంగళూరులోని భవంతిని, భారతి సిమెంట్స్ ను, ఇడుపులపాయ ఎస్టేట్ ను తాకట్టు పెట్టుకోవాలని ప్రజల ఆస్తుల జోలికి రావద్దని టీడీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను, ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని పదేపదే తేల్చి చెబుతున్నారు.

జగన్ సర్కార్ నిర్ణయాలపై టీడీపీ నేతల మండిపాటు
ఇప్పటికే టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విశాఖలో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం ముమ్మాటికీ తుగ్లక్ నిర్ణయం అంటూ జగన్ ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. ప్రజల ఆస్తులను తనఖా పెట్టడానికి వీళ్లకు ఉన్న అధికారం ఏంటి? అంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు .ఇప్పటికే ఏ 2 విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో విలువైన ఆస్తులను దోచుకున్నారని, ఇప్పుడు మళ్లీ ప్రభుత్వ ఐటిఐ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, సర్క్యూట్ హౌస్, తహసిల్దార్ కార్యాలయం, పోలీస్ క్వార్టర్స్ ఇలా 13 విలువైన ప్రజల ఆస్తులను తనఖా పెట్టారని ద్వజమెత్తారు. ఇప్పుడు అశోక్ గజపతి వైసీపీ తీరును ప్రశ్నించారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications