టెర్రరిస్టా? నక్సలైటా?: అశోక్ గజపతి, చంద్రబాబు ఇంటి వద్ద భద్రత పెంపు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్ ట్యాపింగ్‌పై పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో గురువారం ఎయిర్‌కార్గో టెర్మినల్‌ను ప్రారంభించాక ఆయన మీడియాతో మాట్లాడారు.
‘చంద్రబాబు ఏమైనా టెర్రరిస్టా? లేక నక్సలైటా? అని ప్రశ్నించిన ఆయన, ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు?' అని నిలదీశారు. నిజంగా చేయాలనుకుంటే అందుకు చట్టం ఉందని, అనుమతి తీసుకొని చేసుకోవచ్చన్నారు. ఓ న్యూస్ ఛానల్‌ని పోషించడానికి ఇలాంటి పనులు చేయడం తగదని ఆయన హితవు పలికారు.

చంద్రబాబు ఇంటి వద్ద భద్రత పెంపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద కర్నూలు నుంచి వచ్చిన ప్లాటూన్ అదనపు బలగాలు హల్‌చల్ చేస్తున్నాయి. ఓటుకు నోటు కేసు ఉదంతం తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. వీరికితోడు అదనంగా 30 మంది గ్రేహౌండ్స్, 30 మంది ఆక్టోపస్ పోలీసులను నియమించారు.
చంద్రబాబుకు భద్రతపరంగా ఉండే ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో కొత్తగా 8 మందిని చేర్చినట్లు సమాచారం. నివాసానికి సమీపంలోని రోడ్లపై గట్టి నిఘా ఏర్పాటు చేశారు. సమీపంలో ఎవరు వెళుతున్నా ఆరా తీస్తున్నారు.
గత రెండు రోజుల నుంచీ ఇదే పరిస్థితి ఉంది. తాజాగా మారిన రాజకీయ పరిస్థితులు, తెలంగాణ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీకి మధ్య వేడెక్కిన రాజకీయ వాతావరణ పరిస్థితులతో చంద్రబాబు నివాసం వద్ద భద్రత భద్రత పెంచడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications