హీరోయిన్ తో ప్రేమలో ఉన్న మహేష్ బాబు మేనల్లుడు?
మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కొడుకు అశోక్ గల్లా అందరికీ సుపరిచితుడే. 2022లో హీరో సినిమాతో పరిశ్రమలోకి ప్రవేశించాడు. దీనికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. మంచి టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం నిలవలేకపోయింది. తన మొదటి సినిమాకే పెద్ద పెద్ద నటులతో చేసే అవకాశాన్ని గల్లా దక్కించుకున్నాడు.
మొదటి సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. తన రెండో చిత్రానికి ఎక్కువ గ్యాప్ తీసుకున్న అశోక్ ... సాధ్యమైనంత వరకు మంచి కథలు చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. 2020లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న తెలుగమ్మాయి మానస వారణాసి ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది.

మానస, అశోక్ గల్లా ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది. ఇద్దరూ కలిసి ఎంతో సన్నిహితంగా ఉంటున్నారని, తాజాగా వీరిద్దరూ హైదరాబాద్ మదీనాగూడలోని బాబాయ్ హోటల్ ఓపెనింగ్ కు వెళ్లి అక్కడ కెమెరాలకు చిక్కారు. సోషల్ మీడియాలో ఇవి వైరల్ గా మారాయి. వీవరిపై వస్తున్న గాసిప్స్ ఇంకా ఎక్కువయ్యాయి. అయితే అశోక్ టీం అటువంటిదేమీ లేదని చెబుతోంది.
గల్లా అశోక్ తండ్రి గల్లా జయదేవ్ గుంటూరు నుంచి రెండోసారి ఎంపీగా గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గుంటూరు నుంచి విజయం సాధించిన గల్లా ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండనున్నారంటూ వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications