సుజయ Vs ఆశోక్: టిడిపిలో రగులుతున్న విభేదాలు
గిరిజన యూనివర్శిటీ ప్రహరీగోడ శంకుస్థాపన హడావుడిగా చేయడంపై పలు రకాల చర్చలు.
విజయనగరం: విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆధిపత్యపోరు స్పష్టంగా కన్పిస్తోంది.కేంద్ర మంత్రి ఆశోక్‌గజపతిరాజు జిల్లాలో లేని సమయంలో గిరిజన యూనివర్శిటీ ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం పట్ల టిడిపిలో చర్చకు దారితీసింది.
విజయనగరం జిల్లాలో సుజయకృష్ణ రంగారావు కుటుంబానికి, ఆశోక్ గజపతిరాజు కుటుంబాలకు మొదటి నుండి వైరం ఉంది. అయితే సుజయకృష్ణ రంగారావు వైసీపీ నుండి ఇటీవలే టిడిపిలో చేరారు.

సుజయకృష్ణ రంగారావు టిడిపిలో చేరడంతో ఆయనను మంత్రివర్గంలోకి తీసుకొన్నారు చంద్రబాబునాయుడు. అయితే జిల్లా పార్టీలో కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజు వర్గానికి చెక్ పెట్టేందుకు మంత్రి సుజయ కృష్ణరంగారావు వర్గీయులు ప్రయత్నిస్తున్నారనేని ఆశోక్ వర్గీయులు ఆరోపిస్తున్నారు.
సంస్థాగత ఎన్నికల సమయంలో చోటు చేసుకొన్న పరిణామాలను కూడ కేంద్ర మంత్రి ఆశోక్ వర్గీయులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.
కేంద్ర మంత్రి ఆశోక్ గజపతిరాజు జిల్లాలో లేని సమయంలో గిరిజన యూనివర్శిటీ ప్రహరీగోడకు శంకుస్థాపన చేయడం కలకలం రేపుతోంది.యూనివర్శిటీ ప్రహరీగోడ నిర్మాణానికి గాను ఇటీవల మంత్రి సుజయకృష్ణ రంగారావు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమానికి ఎవరికీ పెద్దగా సమాచారం ఇవ్వలేదనే ఆరోపణలున్నాయి.ఈ యూనివర్శిటీకి శంకుస్థాపన చేసిన మరుసటిరోజే జిల్లాకు కేంద్రమంత్రి ఆశోక్ గజపతిరాజు వస్తోన్నప్పటికీ హడావుడిగా ఈ శంకుస్థాపన కార్యక్రమం చేయడం పట్ల పలువురు నేతలు పలు రకాలుగా చర్చించుకొంటున్నారు.












Click it and Unblock the Notifications