జైలు పాలై...: జగన్‌పై అశోక్ గజపతి రాజు తీవ్ర వ్యాఖ్య
విజయవాడ: జైలుపాలై, బెయిల్‌పై తిరుగుతున్నవారంతా నాయకులా అని కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు పి. అశోక్ గజపతిరాజు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో తెలుగుదేశంలో చేరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అశోక్‌గజపతి రాజు జగన్‌ను ఉద్దేశించి ఆ వ్యాఖ్య చేశారు. రాష్ర్టానికి ప్రతిపక్షనేతగా జగన్ ఉండడం సిగ్గుచేటని అన్నారు. పదేళ్ళ పాలనలో ఓ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసిందని కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.

కృష్ణానదిని చూస్తే చాలు వారి పాలన ఏమిటో తెలుస్తుందని, కోట్లు దోచుకున్నవారు నాయకులుగా చలామణి అవుతున్నారని అశోక్‌గజపతిరాజు మండిపడ్డారు. జగన్ అక్రమార్జనకు బెంగుళూరు ప్యాలెస్ ఒక్క ఉదాహరణ అని ఆయన అన్నారు.
రైతులు, గ్రామీణులను చిన్నచూపు చూసిన పార్టీ ఇప్పుడు రాష్ట్రంలోనే లేదని కూడా ఆయన కాంగ్రెసును ఉద్దేశించి అన్నారు. అభివృద్ధి, సంక్షేమ మార్గాలను పటిష్టం చేయడానికి బొబ్బిలి సోదరులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తెలుగువాళ్లు ప్రపంచంలో ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందన్నారు.
కార్యక్రమంలో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు, తెదేపా నేతలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications