ఏపీలో మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాల్సిందే..!!
ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వడగాలులతో అల్లాడుతున్నారు. గరిష్ఠ ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాలలో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఈ రోజు, రేపు ఏపీలో ఇదే పరిస్థితి కొసాగుతుందన వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎండ సమయంలో ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. మరోర 127 మండలాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువ గా ఉంటుందని..తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.
రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం 45 డిగ్రీల వరకు చేరాయి. వడగాలుల తీవ్రత అధికమైంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో 44.8 డిగ్రీలు, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం పంగిడి గూడెంలో 44.7, పల్నాడు జిల్లాలో 44.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. క్రిష్ణా, బాపట్ల. తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, గుంటూరు, నంద్యాల పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఈ రోజు, రేపు వడగాలుల తీవ్రత ఎక్కవగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. సోమవారం రాష్ట్రంలోని 127 మండలాల్లో తీవ్ర వగడాలులు 173 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, అంబేడ్కర్ కోనసమీ జిల్లా, ఏలూరు, పశ్చిమ గోదావరి, క్రిష్టా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అదే విధంగా మంగళవారం 92 మండలాల్లో వడగాలులు..190 మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయని సంస్థ వెల్లడించింది. ఈ వడ గాలుల సమయంలో అవసమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేసింది.
అదే విధంగా సోమవారం పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45-47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి , అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, క్రిష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం నెల్లూరు జిల్లాలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల శాఖ అంచనా వేసింది. ఈ రోజు, రేపు వయసు మళ్లిన వారితో సహా చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఎండ సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటం మంచిందని సూచనలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications