రేపే చర్చించాలి, బాబు పక్కరాష్ట్ర వ్యక్తి: కెసిఆర్, డిగ్గీ పైనా

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన రేపే(సోమవారం) అసెంబ్లీలో చర్చ జరగాలని లేదంటే రాష్ట్రపతిని అవమానపర్చినట్లేనని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం డిమాండ్ చేశారు. కేంద్రం తెలంగాణపై కృతనిశ్చయంతో ఉన్నందున తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినట్లేనన్నారు. అదే సమయంలో తెరాస విలీనంపై మాట్లాడేందుకు ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌కు ఏం పని లేదని అసహనం వ్యక్తం చేశారు.

రాష్ట్రాల ఏర్పాటుపై విశేష అధికారాలు కేంద్రం పరిధిలోనే ఉన్నాయన్నారు. కేంద్రం తెలంగాణపై కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ ఇంకా ఆపుతామని సీమాంధ్ర ప్రాంత నేతలు భావిస్తే అది మూర్ఖత్వమే అవుతుందన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో ఉన్నది సరళమైన ఆంగ్లమేనని కాబట్టి భాషా సమస్య ఇబ్బంది తలెత్తదన్నారు. అవసరమనుకుంటే కావాల్సిన సభ్యులు దానిని అనువాదం చేయించుకోవాలన్నారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ప్రయత్నాలను సీమాంధ్ర ప్రతినిధులు మానుకోవాలన్నారు. రాష్ట్రపతి పాలనను పెట్టి రాష్ట్రాలను విభజించిన చరిత్ర ఉందన్నారు. సమైక్యవాదం పక్కన పెట్టి సీమాంధ్రకు ఏం కావాలో చెబితే బాగుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయినట్లే లెక్క అన్నారు. రాష్ట్ర విభజనకు 371 డి సవరణ అక్కర్లేదన్నారు. హర్యానా రాష్ట్రం ఏర్పడినప్పుడు శాసన సభకు బిల్లు పంపించలేదని గుర్తు చేశారు.

బిల్లుపై అసెంబ్లీలో చర్చ లొసుకులు చెప్పేందుకే నన్నారు. 371డిపై సవరణ అవసరం లేదని, వద్దనుకుంటే తొలగించవచ్చునన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు 371డి సవరణ అవసరం లేదని హైకోర్టు చెప్పిందన్నారు. రాష్ట్రపతి కార్యాలయం నుండి వచ్చిన సమాచారాన్ని సభాపతి టేబుల్ పైన పెట్టాలన్నారు. తెలంగాణ ఉద్యమానికి సీమాంధ్ర నేతల పక్షపాత వైఖరే కారణమన్నారు. తెలంగాణలో ఆంధ్రా ప్రాంత పార్టీలకు చోటు లేదన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చారిత్రక అనివార్యత అని, అడ్డుకోవడం ఎవరి వల్ల కాదన్నారు. పార్లమెంటులో బిల్లు పాస్ కావడమే తరువాయి అని, మిగతా ప్రక్రియ అంతా పూర్తయిందన్నారు. ఎన్టీఆర్ టిడిపిని స్థాపించి కాంగ్రెసును బంగాళాఖాతంలో కలపడం చరిత్ర అని, అలాగే తెలంగాణ కోసం పోరాటం కూడా ఓ చరిత్ర అన్నారు. సమావేశాలు జరుగుతున్నప్పుడు బిల్లు వచ్చినందున బిఎసిలో చర్చించాల్సిన అవసరం లేదన్నారు.

అసెంబ్లీకి వచ్చింది ముసాయిదా బిల్లు మాత్రమేనని, చిన్న చిన్న తప్పులు ఉంటే పార్లమెంటులో సవరించవచ్చునన్నారు. బిల్లులో మార్పులు సూచించే అవకాశం మాత్రమే అసెంబ్లీకి ఉందని, అది హక్కు ఏమీ కాదన్నారు. ముసాయిదా బిల్లుపై ఓటింగ్ ఉండదని అభిప్రాయం మాత్రమే తీసుకుంటారన్నారు. తెలంగాణ విషయంలో బిజెపిని శంకించాల్సిన అవసరం లేదన్నారు. పార్లమెంటును ప్రోరోగ్ చేయరని, నిరవధిక వాయిదా వేస్తారని ఆ తర్వాత ఎప్పుడైనా ప్రారంభించవచ్చునన్నారు.

చంద్రబాబుపై నిప్పులు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రా నాయకుడన్నారు. టి బిల్లు వచ్చిందని చంద్రబాబు ఇటీవల పెడబొబ్బలు పెట్టారని, అరిచారన్నారు. బాబు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. విభజనను వ్యతిరేకిస్తే సీమాంధ్రలో నాలుగు ఓట్లు రాలుతాయని చంద్రబాబు అలా చేస్తున్నారన్నారు. ముసాయిదా బిల్లు ఫ్లైట్లో వస్తే బాబుకు అభ్యంతరమెందుకన్నారు. ముసాయిదా బిల్లు చిత్తు కాగితం కాదని ప్రోటోకాల్ డాక్యుమెంట్ అన్నారు.

చంద్రబాబు ఆంధ్రా ప్రాంత నాయకుడని, అక్కడ ఆయన ఏం చేసుకుంటే తమకేమిటన్నారు. బిజెపి తెలంగాణకు కట్టుబడి ఉన్నామని ఎన్నిసార్లు చెప్పాలన్నారు. చంద్రబాబు ఇప్పుడు పక్క రాష్ట్రం మనిషి అని, ఆయన ఎవరితో పొత్తు పెట్టుకుంటే తమకేమిటన్నారు.

కాగా, అంతకుముందు టిఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కెసిఆర్ మాట్లాడుతూ... అసెంబ్లీలో ముసాయిదా బిల్లును సభ్యులకు పంచగానే చర్చ కోసం పట్టుబట్టాలని సూచించారు. రేపు ముసాయిదాపై చర్చ జరిగి తీరుతుందన్నారు. రెండు రోజుల పాటు మీడియా చర్చకు ఎవరూ వెళ్లవద్దని, పరిస్థితి కొంత గందరగోళంగా ఉందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+