కేజ్రీవాల్ పై నిజమైన రుద్రకరణ్ జోస్యం -ఏపీ ఎన్నికల అంచనాలు ఇలా..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం హోరాహోరీగా మారింది. ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నాయి. పలు సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అంశం పైన గతంలో జోస్యం చెప్పిన ప్రముఖ జ్యోతిష్కుడు రుద్రకరన్ ప్రతాప్ ఏపీ ఎన్నికల ఫలితాల పైన వెల్లడించిన అంచనాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
కేజ్రీవాల్ పై జోస్యం : జ్యోతిష్యులు రుద్ర కరణ్ ప్రతాప్ 2022 మార్చిలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎదుర్కోబోయే సమస్యల గురించి జోష్యం చెప్పారు. మార్చి 2024 లో ఆయన అనేక ఇబ్బందుల్లో చిక్కుకుంటారని అప్పట్లోనే అంచనా వేశారు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అరెస్టయ్యారు. దీంతో రెండేళ్ల క్రితం రుద్ర కరణ్ ప్రతాప్ తన అంచనాలతో చేసిన సోషల్ మీడియా పోస్టింగ్స్ వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో రుద్రకరం ప్రతాప్ ఏపీలో ఎన్నికల ఫలితాల పైన గత ఏడాది జూన్ లో తన అంచనాలను వెల్లడించారు.

కేజ్రీవాల్ అరెస్ట్ తో : 2023 జూన్ రెండున రుద్రకరం ప్రతాప్ ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో మరోసారి జగన్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని తన అంచనాగా వెల్లడించారు. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా జగన్ తన ప్రభుత్వాన్ని కొనసాగిస్తారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కేజ్రీవాల్ విషయంలో రుద్రకరన్ ప్రతాప్ చెప్పింది నిజం కావడంతో, ఏపీ ఎన్నికల ఫలితాల పైన ఆయన చెప్పిందే నిజం అవుతుందా అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ దర్శనమిస్తున్నాయి. ఈ జోశం కూడా నిజం అవుతుందా లేదా అన్నది తెలియాలంటే మరో రెండు నెలల సమయం వేచి చూడాల్సిందేనని నెటిజెన్స్ పోస్టింగ్స్ పెడుతున్నారు.

జగన్ గెలుపు పైనా అంచనాలు : ఏపీలో ఇప్పటికే ఎన్డీఏ కూటమి, వైసిపి మధ్య ఎన్నికల పోరు కొనసాగుతుంది. జగన్, చంద్రబాబు, పవన్ ఈనెల 27 నుంచి తమ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. పోటాపోటీగా సాగే ప్రచారం ద్వారా ఎన్నికల్లో గెలుపు దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఇప్పుడు రుద్ర కరణ్ ప్రతాప్ ఏపీ ఎన్నికల ఫలితాలపై గతంలో వెల్లడించిన అంచనాలు మరోసారి సోషల్ మీడియాలో చర్చకు కారణం అవుతున్నాయి. పలు సర్వే సంస్థలు సైతం ఏపీలో ఎన్నికల పైన తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. దీంతో, ఎన్నికల్లో గెలుపు దక్కేదెవరికి అనేది ఆసక్తిగా మారుతుంది.












Click it and Unblock the Notifications