ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతోందని రైల్లోనుండి భార్యను తోసేశాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

ఒంగోలు: ప్రియుడితో ఫోన్ లో మాట్లాడుతోందనే అనుమానంతో భార్యను భర్త రైల్లో నుండి బయటకు తోసేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.ఈ ఘటన ప్రకాశం జిల్లా చిన్న గంజాం మండలం కడవకుదురు సమీపంలో చోటుచేసుకొంది.

తమిళనాడు ఎక్స్ ప్రెస్ రైళ్లో వెళ్తోన్న అశుతోష్ అనే వ్యక్తి తన భార్య అల్పనాకుమారి తో గొడవపడ్డాడు. గత కొంతకాలంగా అల్పనాకుమారి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అశుతోష్ అనుమానిస్తున్నాడు.

దీంతో ఆశుతోష్ రైలు వేగంగా వెళ్తున్న సమయంలోనే ఆమెను కిందకు తోసేశాడు. దీంతో తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో అల్పనాకుమారి అక్కడికక్కడే మరణించింది.

Asutosh threw his wife from running train in Prakasham district

భార్య, భర్తల మధ్య గొడవలో తాము ఎందుకు తలదూర్చాలని ఊరుకొన్న తోటి ప్రయాణీకులు విజయవాడ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. భార్య ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుండగా అనుమానంతో అశుతోష్ ఈ పనికి పాల్పడినట్టు ప్రయాణీకులు చెప్పారు.

విజయవాడ రైల్వే పోలీసులు నిందితుడు ఆశుతోష్ ను అదుపులోకి తీసుకొన్నారు.మృతదేహన్ని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Asutosh threw his wife from running train in Prakasham district.he suspected on Alpana Kumari talking her lover on phone.Vijayawada police arrested Asutosh.
Please Wait while comments are loading...