గంగవరం పోర్టులో ప్రమాదం: ఇద్దరు మృతి
జిల్లాలోని గంగవరం పోర్టులో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. పోర్టులో షిప్పులోకి ఐరన్ రాడ్లు లోడ్ చేస్తుండగా క్రేను గొలుసులు తెగిపోయాయి. ఈ క్రమంలో కింద పని చేస్తున్న కార్మికులపై ఇనుప రాడ్లు పడ్డాయి.
విశాఖపట్నం: జిల్లాలోని గంగవరం పోర్టులో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. పోర్టులో షిప్పులోకి ఐరన్ రాడ్లు లోడ్ చేస్తుండగా క్రేను గొలుసులు తెగిపోయాయి. ఈ క్రమంలో కింద పని చేస్తున్న కార్మికులపై ఇనుప రాడ్లు పడ్డాయి.
దీంతో అక్కడే పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పనిలో ఉన్న కార్మికులు ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోవక పోవటంతో ప్రాణాలు కోల్పోయారు.

మృతులను సబ్బవరం ప్రాంత వాసులుగా భావిస్తున్నారు. న్యూపోర్టు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications