అమ్మమ్మ వయసులో ఉన్నావిడపై ఆరోపణలా .. లక్ష్మీపార్వతికి మద్దతుగా పోసాని
Recommended Video

ఏపీలో ఎన్నికల సమయంలో అనూహ్య పరిణామం అయిన వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి లైంగిక వేధింపుల ఆరోపణపై ఒక్కొక్కరు నోరు విప్పుతున్నారు. లక్ష్మీ పార్వతి తనను లైంగికంగా వేధిస్తున్నారని , తనకు వైసీపీ నాయకుల నుండి, లక్ష్మీపార్వతి నుండి రక్షణ కావాలని కోటి అనే వ్యక్తి వినుకొండ పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదు పూర్తిగా తప్పని వైసీపీ నేతలు, మద్దతుదారులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన ఈ వివాదంపై నోరు విప్పిన లక్ష్మీపార్వతి తన సహనాన్ని పరీక్షించొద్దు అని మండిపడ్డారు. లీగల్ గా ఫైట్ చేస్తానని చెప్పిన ఆమె ఈ ఆరోపణను చంద్రబాబు కుట్రగా అభివర్ణించారు.
ఇక తాజాగా పోసాని కృష్ణ మురళి లక్ష్మీ పార్వతి వివాదంపై తన స్పందన తెలియజేశారు. ఆమెను కావాలని ఇబ్బంది పెట్టే విధంగా టీడీపీ కుట్ర చేస్తుంది అని చెప్పిన పోసాని కృష్ణ మురళి లక్ష్మీపార్వతిపై కక్షతో కేసులు పెట్టించి అప్రదిష్ట పాలుచేయాలని చూస్తున్నారని మండిపడ్డారు . అంతే కాదు 70 ఏళ్ల వయసున్న లక్ష్మీ పార్వతిపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని, అమ్మమ్మ వయసులో ఉన్న ఆమెపై ఈ తరహా ఆరోపణలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. రాజకీయాల కోసం ఇంత నీచానికి ఒడిగట్టటం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు.

లైంగిక వేధింపుల ఆరోపణలు తనను తీవ్రంగా బాధించాయన్న లక్ష్మీపార్వతికి బాసటగా జీవితారాజశేఖర్ తో పాటు ఇప్పుడు పోసాని కృష్ణ మురళి కూడానిలిచారు. మహిళలపై ఇలాంటి కఠినమైన నిందలు సహించరానివని చెప్పి లక్ష్మీపార్వతిపై కక్షపూరితమైన ఆరోపణగా ఈ లైంగిక వేధింపుల ఆరోపణను పేర్కొన్నారు పోసాని కృష్ణమురళి .












Click it and Unblock the Notifications