ఏపీ ఎన్నికల వేళ.. రైతులకు జగన్ సర్కార్ మరో శుభవార్త.. తగ్గేదేలే!!
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో మళ్ళీ మరో కీలక నిర్ణయం తీసుకుని రైతులకు శుభవార్త చెప్పారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఏపీలో మళ్ళీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకోవాలని తాపత్రయపడుతున్న జగన్ అన్ని వర్గాల వారి మద్దతు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. సంక్షేమ పథకాలతో పాటు, పలు కీలక నిర్ణయాలతో దూసుకుపోతున్నారు.
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు సంక్షేమంపై ఫోకస్ చేశారు. ఇప్పటికే ఏపీలో రైతులకు మూడో విడత రైతు భరోసా జమ చేసిన వైయస్ జగన్, మళ్లీ రైతుల ఖాతాలలోకి మిచాంగ్ తుఫాన్ తో తీవ్ర వర్షాల కారణంగా, తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 2023- 24 ఖరీఫ్, రబీ సీజన్లలో పంట నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారాన్ని అందించారు.

ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతన్నలు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొక్కజొన్నలు, హైబ్రిడ్ రకం జొన్నలకు గిట్టుబాటు ధరలను ప్రకటించింది. మొక్కజొన్నల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్ సర్కార్ మే 15వ తేదీ వరకు కొనుగోళ్లు జరపాలని నిర్ణయించింది.
అంతేకాదు మొక్కజొన్నకు కనీస మద్దతు ధర క్వింటాలుకు 2090 రూపాయలు చొప్పున చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ స్పెషల్ సిఎస్ మార్గదర్శకాలను కూడా జారీ చేయడంతో, మార్క్ ఫెడ్ రంగంలోకి దిగింది. ఆర్బికేల ద్వారా రైతుల రిజిస్ట్రేషన్ కు చర్యలు చేపట్టింది.
ఇదిలా ఉంటే మరోవైపు హైబ్రిడ్ రకం జొన్నలకు సంబంధించి కూడా మార్కెట్ ధర మద్దతు ధర కంటే తక్కువగా ఉండటంతో మంచి గిట్టుబాటు ధరను ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులకు భరోసా కల్పించడం కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద వెంటనే హైబ్రిడ్ రకం జొన్నలను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించిన జగన్ సర్కార్, హైబ్రిడ్ రకం జొన్నలు క్వింటాలు ధర 3180 రూపాయలుగా నిర్ణయించింది. ఆర్బికే ల ద్వారా రిజిస్ట్రేషన్ కు కూడా మార్క్ ఫెడ్ ఏర్పాట్లు చేసింది.












Click it and Unblock the Notifications