Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వరదల సమయంలో మళ్ళీ తెరమీదకు ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు వరదల వేళ ఊహించని రాజకీయం కొనసాగుతుంది. ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో అనేక జిల్లాలు ముంపుకు గురయ్యాయి. ముఖ్యంగా విజయవాడ నగరంలోని అనేక కాలనీలు నీట మునిగాయి.. దీంతో వరద సహాయక చర్యలను చేపట్టిన ఏపీ ప్రభుత్వం నిర్విరామంగా వరద సహాయక చర్యలలో పాల్గొంటుంది.

విపత్తు సమయంలో రంగంలోకి చంద్రబాబు
విజయవాడ ముంపు బాధితుల కోసం రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు వార్డుల వారీగా మంత్రులను ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను రంగంలోకి దింపి వరద సహాయక చర్యలను చేపడుతున్నారు. విపత్తు నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ నుంచి 24 గంటలు 8 మంది ఐఏఎస్ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు.

At the time of floods YCP shocking post on Mumbai actress Kadambari Jethwani case

విజయవాడ లో కొనసాగుతున్న వరద సాయం
వరద ముంపు ప్రాంతాల్లో శరవేగంగా ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆరు హెలికాఫ్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారాన్ని, నీటిని, పాలు, పండ్లు, బిస్కెట్స్, మెడిసిన్స్ పంపిణీ చేస్తున్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి మొదటి ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా తీవ్రంగా కృషి చేస్తుంది. ఇప్పటికే 43,417 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు .197 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. విజయవాడలో సహాయక చర్యలలో 48 ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు నిర్విరామంగా సేవలు అందిస్తున్నాయి.

నటి కాదంబరి జెత్వానీ కేసుపై వైసీపీ పోస్ట్
ఇదిలాఉంటే ఏపీలో వరదల సమయంలో ప్రజలకు అందించాల్సిన సహాయ సహకారాలను పక్కనపెట్టి ముంబైనటి కాదంబరి జెత్వానీ కేసుపైన పోలీసులు ఫోకస్ చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాతో పాటు, సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. గత నాలుగు రోజులుగా ప్రజలు వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంటే విజయవాడ కమిషనర్ రాజశేఖర్ నేతృత్వంలోని నగర పోలీస్ శాఖ దృష్టి మాత్రం అక్కడలేదని పేర్కొంది.

నటి కాదంబరి జెత్వానీ కేసులో నిమగ్నమైన పోలీసులు
వరద సహాయక చర్యల పైన వారి ఫోకస్ లేదంటూ పేర్కొంది. వరద సహాయక చర్యల వైపు దృష్టిసారించి పోలీసులకు దిశానిర్దేశం చేయడం కంటే కమిషనర్ రాజశేఖర్ మరియు ఆయన బృందం ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో నిమగ్నమై ఉన్నారని నాలుగు రోజులుగా వీరు ఈ కేసు పైనే దృష్టి పెట్టారని ఆ పోస్టులో వెల్లడించింది. తీవ్రమైన విపత్తు ఉన్న సమయంలో కూడా కేసు పై అసాధారణ దృష్టి కేంద్రీకరించబడుతుందని పేర్కొంది.

ఈ కేసు వెనుక అంతర్లీనంగా రాజకీయ ఉద్దేశం ఉందని ఆరోపణ
వరద బాధిత జనాభా యొక్క క్లిష్టమైన పరిస్థితులను అర్థం చేసుకొని తక్షణ అవసరాలను అందించే బదులు అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా కాదంబరి జత్వాని కేసును తయారు చేసే పనిలో నిమగ్నమైందని ఆరోపించింది. దీని వెనక అంతర్లీనంగా ఉన్న రాజకీయ ఉద్దేశాలు కనిపిస్తున్నాయని పోస్ట్ చేసింది. సంక్షోభ సమయంలో పోలీసుల నాయకత్వం యొక్క ప్రాధాన్యత ఇప్పుడు ఆందోళన కలిగిస్తుందని ఆ పోస్టు ద్వారా వెల్లడించింది వైసిపి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+