జగన్! పొర్లుదండాలు పెట్టినా లాభం లేదు: అచ్చెన్నాయుడు, ‘పోలీసులు ఊరుకోరు’

Subscribe to Oneindia Telugu

శ్రీకాకుళం/విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాదయాత్రపై ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర కాదు.. పొర్లు దండాలు పెట్టినా ఫలితం ఉండబోదని ఎద్దేవా చేశారు.

పాదయాత్రకు ముందు జగన్ కీలక అడుగులు : వాళ్లే టార్గెట్?

జగన్ నిర్ణయంపై వంగవీటి రాధా అసంతృప్తి: అసలేం జరిగింది?

అద్దె మైకుల పనికిమాలిన విమర్శలు..

అద్దె మైకుల పనికిమాలిన విమర్శలు..

మంగళవారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ స్థానంతోపాటు రాష్ట్రంలోని 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. జగన్ అద్దె మైక్‌లు పనికిమాలిన విమర్శలు చేస్తున్నాయంటూ వైసీపీ నేతలనుద్దేశించి ఎద్దేవా చేశారు.

తప్పుమీద తప్పు చేస్తున్న జగన్

తప్పుమీద తప్పు చేస్తున్న జగన్

ఇది ఇలా ఉండగా, జగన్‌మోహన్‌రెడ్డి తప్పులమీద తప్పులు చేస్తున్నారని, వ్యాపారం చేసినా రాజకీయం చేసినా జగన్‌ది తప్పుడు దారేనని ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ పంచుమర్తి అనురాధ తేల్చి చెప్పారు. మంగళవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

పోలీసులు చూస్తూ ఊరుకోరు..

పోలీసులు చూస్తూ ఊరుకోరు..

పాదయాత్ర పేరుతో కేసుల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని, ప్రజా సమస్యలపై చర్చకు వేదికైన అసెంబ్లీకి రానంటున్న జగన్.. పాదయత్రకి ఎలా వెళతారని అనురాధ ప్రశ్నించారు. అలాగే పాదయాత్ర పేరుతో విధ్వంసాలు సృష్టిస్తే పోలీసులు చూస్తూ ఊరుకోరని, జగన్ పద్ధతి నచ్చక సగం మంది బయటకు వచ్చేశారని ఆమె అన్నారు.

 నవంబర్ మొదటి వారంలో జగన్ పాదయాత్ర..

నవంబర్ మొదటి వారంలో జగన్ పాదయాత్ర..

ఇది ఇలా ఉండగా, వైయస్ జగన్మోహన్ రెడ్డి నవంబర్ మొదటి వారంలో పాదయాత్రను ప్రారంభించనున్నట్లు తెలిసింది. మొదట నవంబర్ 2 నుంచే అనుకున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల నవంబర్ 6 నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నట్లు తెలిసింది. తిరుపతి శ్రీవారిని దర్శించుకుని పాదయాత్రను ప్రారంభించనున్నట్లు సమాచారం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh minister Kinjarapu Atchannaidu and Panchumarti Anuradha on Tuesday lashed out at YSRCP president YS Jaganmohan Reddy.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి