వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ నాడు 43శాతం పీఆర్సీ ఇస్తే.. నేడు జగన్ అసలు వేతనాలకే ఎసరు పెట్టారన్న అచ్చెన్నాయుడు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ విషయంలో రగడ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సి జీవోలలో హెచ్ఆర్ఏ తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నాయి. గురువారం నాడు పీఆర్సీ పై పోరాటంలో భాగంగా ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన పిఆర్సి జీవోలను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్ ల ముట్టడికి పిలుపునిచ్చింది.

ఏపీలో ఆగని పీఆర్సీ రగడ: ఉద్యోగుల నిరసనలు, ప్రతిపక్షాల విమర్శలతో జగన్ సర్కార్ కు తలనొప్పిఏపీలో ఆగని పీఆర్సీ రగడ: ఉద్యోగుల నిరసనలు, ప్రతిపక్షాల విమర్శలతో జగన్ సర్కార్ కు తలనొప్పి

 తెలుగుదేశం పార్టీ 43 శాతం పిఆర్సి ఇస్తే తప్పుబట్టిన జగన్ రెడ్డి ఇప్పుడు చేసిందేంటి

తెలుగుదేశం పార్టీ 43 శాతం పిఆర్సి ఇస్తే తప్పుబట్టిన జగన్ రెడ్డి ఇప్పుడు చేసిందేంటి

ఈ క్రమంలో కలెక్టరేట్ ముట్టడికి అనుమతి లేదని నోటీసులు ఇస్తూ పోలీసులు ఎక్కడికక్కడ ఉపాధ్యాయులను ఉద్యోగులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంతమంది ముఖ్య నాయకులు గృహనిర్బంధం చేశారు. దీనిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హక్కుల కోసం ఉద్యమిస్తే అరెస్టులు చేస్తారా అంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ 43 శాతం పిఆర్సి ఇస్తే తప్పుబట్టిన జగన్ రెడ్డి ఈ రోజు అసలు వేతనాలకే ఎసరు పెట్టారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

న్యాయబద్ధమైన కోరికలను పరిష్కరించాల్సింది పోయి అరెస్టులు చేస్తారా?

న్యాయబద్ధమైన కోరికలను పరిష్కరించాల్సింది పోయి అరెస్టులు చేస్తారా?

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందని కాగ్ నివేదికలు చెబుతున్నాయని, ఆదాయం లేదంటూ ఉద్యోగుల కడుపుకొట్టటం దుర్మార్గమైన చర్య అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఉద్యోగుల న్యాయబద్ధమైన కోరికలను పరిష్కరించాల్సింది పోయి అరెస్టులు చేయడం సిగ్గుచేటని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఉద్యోగులు చేస్తున్న న్యాయబద్ధమైన పోరాటానికి టిడిపి సంపూర్ణ మద్దతు ఇస్తుందని అచ్చెన్నాయుడు ప్రకటించారు . ఉద్యోగుల ఇచ్చిన హామీల లో రెండున్నరేళ్ళలో ఒక్క హామీ కూడా జగన్ అమలు చేయలేదంటూ అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం మొండిచేయి చూపించిందని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ లేదు, వారి ఆశలకు సమాధి కట్టిన జగన్

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ లేదు, వారి ఆశలకు సమాధి కట్టిన జగన్


కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పి వారి ఆశలకు జగన్ సమాధి కట్టారు అంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు , తెలంగాణా కంటే మనమేమి తక్కువ కాదని, తెలంగాణా కంటే ఎక్కువ ఫిట్ మెంట్ ఇస్తూ, 43 % పీఆర్సీ ఇస్తే, జగన్ మోహన్ రెడ్డి కుంటి సాకులు చెప్తూ, ఐఆర్ కంటే తక్కువగా 23% మాత్రమే ప్రకటించారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా జగన్ సర్కార్ పిఆర్సి విషయంలో పునరాలోచన చేయాలని అచ్చెన్నాయుడు సూచించారు. ఉద్యోగులు తమ హక్కులను సాధించుకునే వరకు వారికి టిడిపి అండగా ఉండి పోరాటం చేస్తుందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అచ్చెన్నాయుడు తేల్చిచెప్పారు.

Recommended Video

AP Panchayat Elections 2021 : జైలు నుంచి విడుదలైన Atchannaidu.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌!
పీఆర్సి భిక్ష కాదన్న జవహర్, జగన్ సర్కార్ పై ధ్వజం

పీఆర్సి భిక్ష కాదన్న జవహర్, జగన్ సర్కార్ పై ధ్వజం

ఇదిలా ఉంటే పిఆర్సి బిక్ష కాదు అనే విషయాన్ని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలుసుకోవాలని మాజీ మంత్రి టీడీపీ నేత జవహర్ పేర్కొన్నారు. జగన్ మోసకారి మాటలను ఉద్యోగులు ఎప్పుడో గుర్తించారని ఆయన తెలిపారు చరిత్రలోనే ఇంత చెత్త పిఆర్సి ఇచ్చిన జగన్ చరిత్రలో నిలిచిపోయారని జవహర్ ఎద్దేవా చేశారు. జగన్ ను నమ్మడం ఉద్యోగులకు శాపం అయిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఉద్యోగులకు ఒరిగింది ఏమీ లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా జగన్ ప్రాపకం కోసం కాకుండా తమ వాళ్ళ కోసం ఉద్యోగ సంఘాల నాయకులు పని చేయాలని జవహర్ ఉద్యోగ సంఘాల నాయకులకు చురకలంటించారు.

English summary
TDP gives 43 per cent PRC previously, but now Jagan will reduce the actual wages Atchannaidu mentioned that the TDP was in favor of the employees struggle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X