వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మకూరు వైసీపీ అభ్యర్ధి ఖరారు- మేకపాటి కుంటుంబం అంగీకారం : బైపోల్ కు సిద్దం...!!

|
Google Oneindia TeluguNews

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధి ఖరారయ్యారు. ఆత్మకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ..మంత్రిగా కొనసాగిన మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే, అక్కడ నుంచి పోటీకి ఎవరిని దింపుతారనే అంశం లో సీఎం జగన్ పూర్తిగా మేకపాటి కుటుంబం నిర్ణయం మేరకే వ్యవహరిస్తామని స్పష్టం చేసారు. ఇప్పటికే ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ గా ఉందంటూ అసెంబ్లీ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చింది. ఇక, మేకపాటి కుటుంబం గౌతమ్ మరణం బాధ నుంచి క్రమేణా కోలుకుంటూ.. ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది.

ఆత్మకూరు వైసీపీ అభ్యర్ధిగా విక్రమ్ రెడ్డి

ఆత్మకూరు వైసీపీ అభ్యర్ధిగా విక్రమ్ రెడ్డి


ఆత్మకూరు నియోజకవర్గ అభ్యర్థిగామేకపాటి విక్రమ్ రెడ్డి పేరును మేకపాటి కుటుంబం ఖరారు చేసింది. ఇదే విషయం పై మేకపాటి కుటుంబంతో చర్చించిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మేకపాటి విక్రమ్ రెడ్డి ఊటీలోని గుడ్ షెఫర్డ్ పబ్లిక్ స్కూల్ లో విద్యాభ్యాసం చేసారు. ఐఐటీ చెన్నైలో సివిల్ సబ్జెక్టులో బీ.టెక్ పూర్తి చేసి..అమెరికాలో కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లో ఎం.ఎస్ చదివారు. మేకపాటి విక్రమ్ రెడ్డి సైతం అచ్చు గుద్దినట్టుగా గౌతమ్ రెడ్డి లాగానే ఉంటారు. గౌతమ్ సోదరుడు అయిన విక్రమ్ రెడ్డి .. రాజమోహన్ రెడ్డి రెండో కుమారుడు. గౌతమ్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం నుంచి కేఎంసీ సంస్థకు విక్రమ్ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మేకపాటి కుటుంబం నిర్ణయం..

మేకపాటి కుటుంబం నిర్ణయం..


గౌతమ్ మరణంతో ఆయన సతీమణిశ్రీ కీర్తి ఆత్మకూరు నుంచి బరిలో ఉంటారనే ప్రచారం సాగింది. కానీ,మేకపాటి కుటుంబం నిర్ణయం మేరకే ముందుకు వెళ్లాలని సీఎం నిర్ణయించటంతో..కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కుటుంబంలో అందరూ చరర్చించి.. రానున్న ఆత్మకూరు ఉప ఎన్నికల్లో విక్రమ్ రెడ్డిని బరిలోకి దించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రిగా ఉంటూ మరణించటంతో...రాజకీయ పార్టీలు అక్కడ పోటీ పెట్టే అవకాశం లేదు. మరణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అభ్యర్ధులుగా బరిలో నిలిస్తే..పోటీ పెట్టకూడదనే సాంప్రదాయం ఏపీలో చాలా కాలంగా ఉంది. కొన్ని సందర్భాల్లో మినహా..ఇది అమలు చేస్తున్నారు.

మంత్రిగా ఛాన్స్ దక్కేనా..

మంత్రిగా ఛాన్స్ దక్కేనా..

ఇక, చిన్న వయసులోనే మరణించిన గౌతమ్ కు అన్ని పార్టీల నేతలు సంతాపం ప్రకటించారు. ఈ ఉప ఎన్నికలో ఎవరైనా స్వతంత్రంగా బరిలో దిగితే మినహా.. ఆత్మకూరు ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇప్పుడు విక్రమ్ పేరు ఖరారు కావటంతో...కేబినెట్ లో స్థానం కల్పిస్తారా..లేక, ఎమ్మెల్యేగా కొనసాగించేందుకు మొగ్గు చూపుతారా అనేది అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. దీంతో.. మేకపాటి కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయంగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దమైంది.

English summary
YSRCP confirms it's candidate for athmakur bypoll which fell vacant with sudden demise of Mekapati Goutham reddy. His brother Vikram reddy will be the candidate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X