జగన్ ఇంటిపై రాళ్ల దాడి..ఖండించిన వైసీపీ
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇంటివద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మూడు రోజులు పర్యటనలో భాగంగా శనివారం ఆయన పులివెందుల చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కడప వెళ్లిన జగన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో ఆయన పులివెందులకు చేరుకున్నారు. జగన్ పులివెందులకు వచ్చారన్న సమాచారంతో పార్టీ శ్రేణలు, అభిమానులు భారీ ఎత్తున జగన్ నివాసానికి చేరుకున్నారు. వారిని పోలీసులు సైతం కట్టడి చేయలేకపోయారు. అయితే ఇదే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు జగన్ ఇంటిపై రాళ్లతో దాడికి చేశారు.

జగన్ ఇంట్లోకి చొరబడి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఊహించని పరిణామంతో అటు పార్టీ శ్రేణులు సైతం షాక్ అయ్యారు. అయితే ఈ దాడికి పాల్పడింది వైసీపీ కార్యకర్తలే అని ప్రచారం జరిగింది.జగన్ ఈ ఐదేళ్లు పులివెందులను పట్టించుకోలేదంటూ కొందరు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ఇంటిపై దాడి చేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ఘటనపై వైసీపీ స్పందించింది.
జగన్ నివాసం వద్ద వైసీపీ శ్రేణులు తిరుగుబాటు చేశారనే వార్తల్లో నిజం లేదని, కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తు్న్నారని మండిపడింది.తప్పుడు కథనాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. సొంత జిల్లా ప్రజలు సైతం జగన్‌కు షాకిచ్చారు. కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో కురుకుపోయారు.












Click it and Unblock the Notifications